iDreamPost
android-app
ios-app

Prabhas: స్పిరిట్ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు!

  • Published Sep 03, 2024 | 4:38 PM Updated Updated Sep 03, 2024 | 4:38 PM

Prabhas, Spirit: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Prabhas, Spirit: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 03, 2024 | 4:38 PMUpdated Sep 03, 2024 | 4:38 PM
Prabhas: స్పిరిట్ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు!

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ పేరుతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతోంది. ఇప్పటికే స్పిరిట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. దాంతో పాటుగా స్క్రిప్ట్ ను కూడా ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేస్తానని గతంలోనే సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. ఇక ఇందులో ప్రభాస్ సూపర్ కాప్ గా కనిపిస్తాడని, ఇప్పటి వరకు ప్రభాస్ ను ఎవ్వరూ చూపించన విధంగా చూపిస్తానని డైరెక్టర్ అన్న మాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది.

ప్రభాస్ స్పిరిట్ మూవీకి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. దాంతో ఈ మూవీలో ప్రభాస్ ఎలా ఉంటాడు? అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ తో పాటుగా అందరిలో నెలకొంది. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకివచ్చింది. స్పిరిట్ లో ప్రభాస్ రెండు విభిన్నరకాలైన పాత్రలు చేయబోతున్నాడని, అందులో ఒకటి మరీ వయలెంట్ గా ఉంటుందని, ఇంకోటి సాఫ్ట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? ఈ సినిమాలో డార్లింగ్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ న్యూస్ కాస్త వైరల్ కావడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సందీప్ రెడ్డి టేకింగ్ కు డార్లింగ్ మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తే.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయమే అని అభిమానులు ఖుషి అవుతున్నారు.

కాగా.. మాఫియా నేపథ్యంలో సాగే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఏ రేంజ్ లో  రెచ్చిపోయి నటిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దాంతో పాటుగా హను రాఘవపూడి తో ‘ఫౌజీ’, సలార్ 2, కల్కి 2 చిత్రాలు ఉండనే ఉన్నాయి. మరి స్పిరిట్ మూవీలో మాఫియా డాన్ గా ప్రభాస్ కనిపిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş