iDreamPost
android-app
ios-app

ఇద్దరు టాప్ హీరోలతో మలినేని గోపీచంద్ జాక్ పాట్

  • Published Mar 21, 2024 | 1:12 PM Updated Updated Mar 21, 2024 | 1:12 PM

ఏ హీరోతో చేసినా కూడా ఆ హీరో ఇమేజ్ కి తగినట్టుగా కమర్షియల్ ఫార్ములాని కూడా దానికి తగినట్టుగా కథను పరపెక్టు ఫిట్ స్టయిల్లో ప్రజెంట్ చేయగలగడం గోపీచంద్ ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను గానీ, సదరు హీరోల అభిమానులను గానీ నిరాశపరచవు.

ఏ హీరోతో చేసినా కూడా ఆ హీరో ఇమేజ్ కి తగినట్టుగా కమర్షియల్ ఫార్ములాని కూడా దానికి తగినట్టుగా కథను పరపెక్టు ఫిట్ స్టయిల్లో ప్రజెంట్ చేయగలగడం గోపీచంద్ ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను గానీ, సదరు హీరోల అభిమానులను గానీ నిరాశపరచవు.

  • Published Mar 21, 2024 | 1:12 PMUpdated Mar 21, 2024 | 1:12 PM
ఇద్దరు టాప్ హీరోలతో మలినేని గోపీచంద్ జాక్ పాట్

హిట్ ఫిల్మ్స్ డైరెక్టర్ గా స్ట్రాంగ్ రికార్డునే నిలబెట్టుకున్న డైరెక్టర్ మలినేని గొపీచంద్. ఏ హీరోతో చేసినా కూడా ఆ హీరో ఇమేజ్ కి తగినట్టుగా కమర్షియల్ ఫార్ములాని కూడా దానికి తగినట్టుగా కథను పరపెక్టు ఫిట్ స్టయిల్లో ప్రజెంట్ చేయగలగడం గోపీచంద్ ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను గానీ, సదరు హీరోల అభిమానులను గానీ నిరాశపరచవు. అందుకే మలినేనికి ఎప్పుడూ ఆఫర్లకి కొరత ఉండదు. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ ప్రయాణించడంలో తనదైన మార్కును మిస్ కాకుండా కమర్షియల్ డైరెక్టర్ గా నిలద్రొక్కుకోవడమే మలినేని గోపీచంద్ కెరీర్లో హైలైట్. ఇంతవరకూ చేసిన ఏ సినిమా అయినా ఓ రికార్డుగా నిలబడితే, త్వరలో చేయబోతున్న సినిమాలు అయన డైరెక్టోరియల్ కెరీర్ని మరింత గ్లామరైజ్ చేసేవి కావడం విశేషం.

అవేంటంటే….మలినేని గోపీచంద్ చేయబోతున్న సినిమాలు రెండింటికీ రెండూ ప్రత్యేకమైనవే. అంతకన్నా ప్రత్యేకత…చెప్పాలంటే ఒకే కథతో ఇండియాలోనే ఇద్దరు టాప్ హీరోలతో చేయబోతున్నారు మలినేని గోపీచంద్. పైగా ఈ రెండు సినిమాలని నిర్మాణరంగంలో లేటెస్ట్ గా అత్యున్నతమైన స్థాయిని సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేయబోతుండడం. ఆ ఇద్దరు హీరోలు ఎవరనే ఉత్కంఠ మొన్నటివరకూ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే లీక్ అవుతోంది.

వాళ్ళల్లో ఒకరు…గతంలో మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డిలాటి సూపర్ హిట్ చిత్రాన్ని యువరత్న బాలక్రిష్ణతో చేసిన సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి చిత్రం బాలయ్య నటించిన సినిమాలలో ప్రత్యేకమైన సినిమాగా ఆయన అభిమానులను అలరించింది. సో….తెలుగులో సినిమాకి బాలక్రిష్ణ హీరోగా చేయబోతున్నారు. మలినేని గోపీచంద్, బాలయ్య కాంబినేషన్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ హంగులతో పాటు, టాప్ బేండ్ కేస్టింగ్, భారీ బడ్జెట్టలు విపరీతమైన క్రేజ్ వచ్చినట్టే ఉంటాయి. చేసేదేమో…మైత్రీ మూవీ మేకర్స్. ఇంక బాలయ్య ఫేన్స్ కి పండగే పండగ. వీరసింహారెడ్డి నిర్మాతలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో తాజా చిత్రం మీద అంచనాలు ఎలా ఉంటాయి?

Gopichand malineni with balakrishna and sunny deol

ఇదే కథకి హిందీలో….ఇటీవలే గదార్ 2 సినిమాతో ఇండియా మొత్తం మీద సంచలనం రేపిన సన్నీడియోల్. వింతగా అనిపిస్తోంది కదూ…ఏస్…సన్నీ డియోల్ తోనే మలినేని గోపీచంద బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా లేటెస్ట్ లీక్. తెలుగు డైరెక్టర్లన్నా, తెలుగు ప్రొడక్షన్ హౌసెస్ అన్నా బాలీవుడ్ ఈ మధ్య పీక కొసుకుంటోంది. అందుకే సన్నీ డియోల్ కథ వినగానే ఓకే చెప్పేశాడట. సన్నీ డియోల్ కూడా అక్కడ ప్రస్తుతం గొప్ప మార్కెట్లో ఉన్నాడు. హిందీలో రామాయణం నిర్మిస్తుంటే సన్నీడియోల్ లాటి స్ట్రాంగ్ ఫిజిక్ అండ్ పెరఫారమెన్స్ స్ట్రెంగ్త్ రెండూ ఉన్నా హీరో అయితే హనుమంతులవారి పాత్రను చేయాలని వెతికితే వాళ్ళకి సన్నీడియోల్ తప్పితే మరొకరు కనిపించలేదు. అక్షరాల 200 కోట్లు పారితోషకం. అదీ సన్నీ క్రేజ్ ఇప్పుడు.

రెండూ రెండు రకాలుగా స్పెషల్ ప్రాజెక్టులు మైత్రీ సంస్థకి. వాళ్ళ దమ్మూ ధైర్యం మామ్మూలివి కావు. ఒకే సంవత్సంలో ఒకే పండగకి ఇటు బాలయ్యతో వీరసింహారెడ్డి, మెగాస్టార్ తో వాల్టేర్ వీరయ్యా వంటి భారీ బడ్జెట్టు సినిమాలు తీసి, పక్కపక్క తేదీలలో రిలీజు చేసి రికార్డు క్రియేట్ చేసింది మైత్రీ సంస్థ. మైత్రీ సంస్థ మరో రికార్డు…పుష్ప లాటి సినిమాతో నార్త్ ఇండియానే కాదు. హోల్ ఇండియానే కుదిపేశారు. త్వరలో అంటే ఆగష్టు 15న పుష్ఫ 2 వస్తోందంటే బాలీవుడ్డే గడగడలాడుతోంది. అలాటి మైత్రీ సంస్థ మరో రెండు అనర్ఘరత్నాలతో రావడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుందని తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom