Keerthi
బాలీవుడ్ సెలబ్రిటీ స్టార్ కపుల్స్ లో జెనీలియా డిసౌజా, రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఒకరు. అయితే తాజాగా ఈ స్టార్ సెలబ్రిటీ జంట ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరి చేసని పనికి పలువురు నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా.. వీరి చేస్తున్న మంచి పనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా షేర్ చేశారు.
బాలీవుడ్ సెలబ్రిటీ స్టార్ కపుల్స్ లో జెనీలియా డిసౌజా, రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఒకరు. అయితే తాజాగా ఈ స్టార్ సెలబ్రిటీ జంట ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరి చేసని పనికి పలువురు నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా.. వీరి చేస్తున్న మంచి పనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా షేర్ చేశారు.
Keerthi
సినీ ఇండస్ట్రీలో నటించే నటి, నటులు ప్రేమలు వివాహాలు చేసుకోవడం అనేది కొత్తేమీ కాదు. ఎందుకంటే.. ఎప్పటి నుంచే ఈ ట్రెండ్ అనేది కొనసాగతునే ఉంది. అయితే ఇలా మొదటిలో ప్రేమించుకొని, ఆ తర్వాత పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు కొన్నాళ్లకే విడిపోతున్నారు. కానీ, మరి కొందరు మాత్రం ఆదర్శ దంపతులుగా ఒకరిపై ఒకరు ఇష్టం, గౌరవంతో కలిసి లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా, ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో అనోన్యుంగా ఉండే లవ్లీ కపుల్స్ చాలామంది ఉన్నారు అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఓ స్టార్ సెలబ్రిటీ జంట కూడా ఒకరు. ఇక ఈ జంటగా ఎక్కడ కనిపించిన చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. ఇక ఈ ముచ్చటైన జంటకు సినీ ఇండస్ట్రీలోనే కాదు, అభిమానుల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ఎంతో హ్యాపీగా ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నా ఈ జంట తాజాగా అవయవ దానం ప్రకటించారు. పైగా ఈ దంపతులు చేసిన పనికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇంతకి ఈ జంట ఎవరంటే..
బాలీవుడ్ సెలబ్రిటీ స్టార్ కపుల్స్ లో జెనీలియా డిసౌజా, రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఒకరు. కాగా, వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా విషయం తెలిసిందే. ఇక వారి ప్రేమ బంధానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, పర్సనల్ లైఫ్ పరంగానూ ఎంతో హ్యాపీగా ఉంటున్నా ఈ లవ్లీ కపుల్స్ తాజాగా అవయవదానం ప్రకటించారు. ఇక అందుకు సంబంధించి ఈ దంపతులకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు కూడా తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో రీతేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా, ఆ వీడియోలో అవయవ దానానికి బతికి ఉన్నప్పుడే అంగీకార సంతకం చేయాలి. ఈ విధంగా సంతకం చేసిన వ్యక్తి మరణించిన తర్వాత కళ్లు వంటి అవయవాలు ఆర్గనైజేషన్ వాళ్లు తీసుకోవడానికి అవుతుందని తెలిపారు. అలాగే తామిద్దరం కూడా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నమని తెలిపారు.
ఇకపోతే గతంలోనే అవయవ దానం చేస్తామని జెనీలియా, రితేశ్ దంపతులు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ దంపతులిద్దరూ మరోసారి అవయవదానంపై ప్రతిజ్ఞ చేశారు. అలాగే జెనీలియా, రితేశ్ లకు సంబంధించిన వీడియోను స్వయంగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ షేర్ చేసింది. దీంతో వారిద్దరికి ధన్యవాదాలు తెలిపుతూ.. వీరి నిర్ణయం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని అంటూ ప్రశంసలు కురిపించింది.
Thanks to Riteish Deshmukh & Genelia, the Bollywood star couple for pledging to donate their organs during the ongoing organ donation month of July. Their gesture will motivate others also to connect with the noble cause.#organdonation #Bollywood #savelives pic.twitter.com/lJ1Yiyaj1o
— NOTTO (@NottoIndia) July 6, 2024