iDreamPost
android-app
ios-app

మరోసారి తల్లిదండ్రులైన గీతా మాధురి, నందు

  • Published Feb 19, 2024 | 12:33 PM Updated Updated Feb 19, 2024 | 12:33 PM

టాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో ఒకరు సింగర్ గీతామాధురి, హీరో నందు. ప్రస్తుతం వీరిద్దరూ ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. తాజాగా గీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

టాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో ఒకరు సింగర్ గీతామాధురి, హీరో నందు. ప్రస్తుతం వీరిద్దరూ ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. తాజాగా గీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

  • Published Feb 19, 2024 | 12:33 PMUpdated Feb 19, 2024 | 12:33 PM
మరోసారి తల్లిదండ్రులైన గీతా మాధురి, నందు

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకరు సింగర్ గీతా మాధురి, హీరో నందు. సింగింగ్‌తో గీత ఓలలాడిస్తుండగా.. నందు యాంకరింగ్, యాక్టింగ్‌లతో బిజీగా మారిపోయారు. మాస్ పాటలకు తనదైన హుషారు గాత్రం అందించి..మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు గీత. ఇక నందు మొన్నటి వరకు క్రికెట్ మ్యాచులకు సంబంధించి యాంకర్‌గా వ్యహరిస్తూ..ఇప్పుడు బుల్లితెరపై అలరిస్తున్నారు. అలాగే అటు క్యారెక్టర్, ఇటు సెకండ్ హీరో పాత్రలను పోషిస్తున్నారు. వెబ్ సిరీస్ ల ద్వారా ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు.  ప్రస్తుతం వీరిద్దరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

మరోసారి గీతా, నందులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. గీతా మాధురి ప్రెగ్నెంట్ అన్న సంగతి విదితమే. మొన్నటి మొన్న ఆమె శ్రీమంతం ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమె బేబీకి జన్మనిచ్చింది. ఫిబ్రవరి 10న ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది గీతా మాధురి. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టు చేసింది. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఈ స్టార్ ఫిమేల్ సింగర్. గతంలో వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ పాప పేరు దాక్షాయణి ప్రకృతి.

టాలీవుడ్ హీరో నందు, గీతా మాధురిలది ప్రేమ వివాహం అన్న సంగతి విదితమే. 2014లో వీరి వివాహం జరగ్గా.. 2019లో పాప పుట్టింది. ప్రస్తుతం వీరికి బాబు జన్మించాడు. కాగా, గతంలో నందు, గీతా విడిపోయారంటూ పలుమార్లు వార్తలు షికార్లు చేసిన ప్రతిసారి.. వాటిని ఖండించుకుంటూ వస్తోంది ఈ జంట. తాజాగా అలాంటి వార్తలే బయటకు రాగా, వాటన్నింటికి గట్టి జవాబునిస్తూ.. అతడితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది గీతా. ఇక నందు కూడా మొన్న పూర్ పీపుల్స్ కోసం స్వయంగా వడ్డి వార్చాడు.  కాగా, వీరికి బాబు జన్మించాడని తెలియగానే.. అభిమానులు.. వీరికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş