iDreamPost
android-app
ios-app

థియేటర్స్ లో దుమ్ము దులుపుతోంది.. ఓటిటి రిలీజ్ అప్పుడేనట!

  • Author ajaykrishna Updated - 01:54 PM, Tue - 29 August 23
  • Author ajaykrishna Updated - 01:54 PM, Tue - 29 August 23
థియేటర్స్ లో దుమ్ము దులుపుతోంది.. ఓటిటి రిలీజ్ అప్పుడేనట!

కొన్నాళ్ళుగా బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస ప్లాప్ లతో నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు దేశవ్యాప్తంగా బాలీవుడ్ పేరు మార్మోగిపోయేది. కానీ.. ఇప్పుడు సౌత్ సినిమాలే పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నాయి. నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ లో ఇన్నాళ్లు కథాకథనాలు బాగున్నా.. రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల సినిమాలన్నీ బోల్తా కొడుతూ వచ్చాయి. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేసిన సినిమాలే బాలీవుడ్ ని ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ సినిమాతో షారుఖ్.. బాలీవుడ్ కి ఓ ఊపు ఇచ్చాడు. అదే ఊపుని తర్వాత వచ్చిన సినిమాలు కంటిన్యూ చేయలేకపోయాయి.

ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా కాకపోయినా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి హిట్స్ అనిపించుకున్నాయి. కానీ.. పఠాన్ తర్వాత ఆ స్థాయిలో ఏ సినిమా ప్రభంజనం సృష్టించలేదు.. అనుకుంటున్న టైమ్ లో.. రీసెంట్ గా ‘గదర్ 2’ వచ్చింది. ఆగష్టు 11న విడుదలైన గదర్ 2.. 2001లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గదర్ మూవీకి సీక్వెల్. అనిల్ శర్మ దర్శకత్వంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలలో గదర్ 2 తెరకెక్కింది. అప్పట్లో గదర్ ఏ విధంగా ఇండస్ట్రీలో రికార్డులు సెట్ చేసిందో.. అదే రేంజ్ లో గదర్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 17 రోజులలో దాదాపు రూ. 590 కోట్లకు పైగా వసూల్ చేసి.. ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది గదర్ 2.

ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. ఓటిటి రిలీజ్ ఎప్పుడు అవుతుందా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు. తాజాగా గదర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ విషయమై డైరెక్టర్ అనిల్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “గదర్ 2 ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఇంకా సినిమాని థియేటర్స్ లోనే కొనసాగిస్తాం. ఇక ఈ సినిమాని ఇప్పట్లో ఓటిటి రిలీజ్ చేయాలని అనుకోవట్లేదు. దాదాపు 6 నెలల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కి ఇచ్చే ఆలోచన లేదు” అని చెప్పేశారు. దీంతో గదర్ 2 కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఓటిటి ఫ్యాన్స్ కి నిరాశే మిగిలిందని చెప్పాలి. మరి గదర్ 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom