Shah Rukh Khan: యువతను పక్కదారి పట్టించే యాడ్స్ అవసరమా షారుఖ్..?

యువతను పక్కదారి పట్టించే యాడ్స్ అవసరమా షారుఖ్..?

  • Author ajaykrishna Updated - 01:55 PM, Tue - 29 August 23
  • Author ajaykrishna Updated - 01:55 PM, Tue - 29 August 23
యువతను పక్కదారి పట్టించే యాడ్స్ అవసరమా షారుఖ్..?

ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటారు. అవి సబ్బులు, సర్ఫ్ లు.. పెర్ఫ్యూమ్స్.. కూల్ డ్రింక్స్, పాన్ మసాలా.. ఇలా అన్ని రకాల యాడ్స్ చేసి మనీ వెనకేసుకుంటారు. అయితే.. ఇక్కడ వారు యాడ్స్ చేసి డబ్బులు సంపాదించుకోవడం సమస్య కాదు. ఎలాంటి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారు అనేది పాయింట్. కొన్నిసార్లు ఎక్కువ మనీ ఆఫర్ చేయడంతో లేదా వేరే ఏదైనా కారణాలతో వివాదాలకు దారి తీసే యాడ్స్ చేస్తుంటారు సెలబ్రిటీలు. దీనికి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా మినహాయింపు కాదు. షారుఖ్ చేసిన యాడ్.. ఏకంగా అతని ఇంటి ముట్టడికి దారి తీసింది. ప్రెజెంట్ ఈ విషయం బి టౌన్ లో చర్చనీయంశంగా మారింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో స్టార్ హీరోలు కొంతమంది పాన్ మసాలాలతో పాటు ఆన్ లైన్ గేమింగ్ యాప్స్.. ఆల్కహాల్ రిలేటెడ్ యాడ్స్ చేస్తుంటారు. వీటి వల్ల యూత్ లైఫ్ పై ప్రభావం పడుతుందనేది వాస్తవం. ఎందుకంటే.. అభిమాన హీరో ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాడంటే ఏదొక బెన్ఫిట్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. కానీ.. ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ వల్ల ఫ్యాన్స్ కూడా డబ్బులు, టైం వృధా చేసుకుంటున్నారు. ఇటీవల కింగ్ షారుఖ్.. ఓ ఆన్ లైన్ రమ్మీ గేమింగ్ యాప్ కోసం యాడ్ చేశాడు. అది ఎప్పుడో చేసినప్పటికీ.. ఇలాంటి యాప్స్ తో యూత్ కి ఏం సందేశం ఇస్తున్నారంటూ.. ఇప్పుడు విమర్శలు గుప్పుమంటున్నాయి.

షారుఖ్ ఆ యాప్ ని ఎప్పుడో చేసినా.. ఇప్పటికి సదరు యాప్ షారుఖ్ ని చూపిస్తూ తెగ ప్రమోషన్స్ చేస్తోంది. ఇదివరకు ఇలాంటి యాప్స్, యాడ్స్ పై విమర్శలు, కోర్టు కేసులు జరిగాయి. అయినా.. స్టార్ హీరోలు ఇలా చేస్తుండటంతో పెద్ద రచ్చకు దారి తీస్తున్నాయి. ఆన్ లైన్ గేమ్స్ నుండి యూత్ ని రక్షించే NGO.. అన్ టచ్ ఇండియా ఫౌండేషన్ షారుఖ్ పైన విమర్శలు చేసింది. ఒక స్టార్ హీరో అయ్యుండి యువతను పాడుచేసే యాడ్స్ మీకు అవసరమా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆ ఫౌండేషన్ కి సంబంధించి కొందరు యువకులు.. ముంబై బాంద్రాలోని షారుఖ్ ఇల్లు మన్నత్ ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. విషయం ముందే తెలుసుకున్న పోలీసులు వారి ముట్టడిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి స్టార్ హీరోలు ఇలాంటి యాడ్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments