iDreamPost
android-app
ios-app

‘గామి’ వర్సెస్ ‘భీమా’.. డే 2 కలెక్షన్స్.. శివరాత్రి విన్నర్ ఎవరో క్లియర్​గా తేలిపోయింది!

  • Published Mar 10, 2024 | 1:49 PM Updated Updated Mar 10, 2024 | 1:49 PM

ఈసారి మహాశివరాత్రి కానుకగా తెలుగు బాక్సాఫీస్ దగ్గర ‘గామి, ‘భీమా’ రూపంలో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండ్రోజుల రన్ ముగిసేసరికి వీటిల్లో ఏ మూవీ విన్నరో తేలిపోయింది.

ఈసారి మహాశివరాత్రి కానుకగా తెలుగు బాక్సాఫీస్ దగ్గర ‘గామి, ‘భీమా’ రూపంలో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండ్రోజుల రన్ ముగిసేసరికి వీటిల్లో ఏ మూవీ విన్నరో తేలిపోయింది.

  • Published Mar 10, 2024 | 1:49 PMUpdated Mar 10, 2024 | 1:49 PM
‘గామి’ వర్సెస్ ‘భీమా’.. డే 2 కలెక్షన్స్.. శివరాత్రి విన్నర్ ఎవరో క్లియర్​గా తేలిపోయింది!

మహాశివరాత్రి పర్వదినానికి తెలుగులో పెద్దగా సినిమాలు రావు. వచ్చినా ఒకట్రెండు చిన్న చిత్రాలే తప్ప.. బిగ్ మూవీస్ రిలీజ్ కావడం చాలా అరుదు. కానీ ఈసారి శివరాత్రిని టార్గెట్ చేసుకొని రెండు మీడియం బడ్జెట్ మూవీస్ ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. అందులో ఒకటి మాస్​ కా దాస్ విశ్వక్​సేన్ నటించిన ‘గామి’ కాగా.. రెండోది మాచో స్టార్ గోపీచంద్ యాక్ట్ చేసిన ‘భీమా’. విడుదలకు ముందు వీటి మీద మంచి హైప్ నెలకొంది. ఇందులో ‘గామి’కి మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ రాంపేజ్ నడుస్తోంది. గోపీచంద్ ‘భీమా’కు మిక్స్​డ్ టాక్ వచ్చినా ఆ సినిమా కూడా మంచి రన్​నే కొనసాగిస్తోంది. అయితే ప్రీ రిలీజ్, ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ డామినేషన్ కొనసాగిస్తూ వచ్చిన విశ్వక్​ మూవీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలోనూ గోపీచంద్ సినిమాపై ఆధిపత్యం చూపిస్తోంది.

‘గామి’ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9.07 కలెక్షన్స్ రాబట్టింది. విశ్వక్​సేన్ కెరీర్​లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. హిట్ టాక్​తో దూసుకుపోతున్న ఈ ఫిల్మ్ డే 2 కూడా బాక్సాఫీస్ దగ్గర హవా చూపించింది. రెండో రోజు రూ.6.03 కోట్లను ‘గామి’ కలెక్ట్ చేసింది. ఇలా రెండ్రోజుల్లో కలిపి వరల్డ్​వైడ్​గా రూ.15.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ‘గామి’ బ్రేక్ ఈవెన్​కు దగ్గర్లో ఉందని.. మూడో రోజు వచ్చే వసూళ్లతో సినిమా చాలా చోట్ల లాభాల్లోకి వెళ్లడం ఖాయమని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. ఇక, ‘భీమా’ విషయానికొస్తే.. ఆ మూవీ రెండ్రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలుస్తోంది. తొలి రోజు రూ.4 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన గోపీచంద్ ఫిల్మ్.. రెండో రోజు రూ.3 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఓవరాల్​గా ఈ ఫిల్మ్ కలెక్షన్స్ రూ.7.5 కోట్ల లోపే ఉన్నాయని ట్రేడ్ టాక్.

ఆ లెక్కన శివరాత్రి విన్నర్ నిస్సందేహంగా ‘గామి’ అనే చెప్పాలి. ట్రేడ్ క్యాలిక్యులేషన్స్, మూవీ టీమ్ అనౌన్స్​మెంట్ రెండూ బేరీజు వేసుకున్నా ‘గామి’ రెండ్రోజుల వసూళ్లు రూ.12 నుంచి రూ.14 కోట్ల మధ్య ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్​కు దగ్గరగా వచ్చేసినట్లే. ఎలాగూ ఆదివారం ఉంది.. నెక్స్ట్ వీకెండ్​లో పెద్ద చిత్రాలు లేవు, కావాల్సినన్ని థియేటర్లు చేతిలో ఉన్నాయి కాబట్టి ‘గామి’ భారీగా లాభాలు మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ‘భీమా’ గురించి ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ మూవీ రెండో రోజు వసూళ్లు కాస్త డౌన్ అయ్యాయి.

‘భీమా’ ఫిల్మ్ రెండ్రోజుల వసూళ్లు కూడా రూ.8 కోట్ల లోపే ఉన్నాయని తెలుస్తోంది. అటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా భారీగా ఉండటం, ‘గామి’ నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో గోపీచంద్ సినిమాకు సిచ్యువేషన్​ టఫ్​గా మారింది. ‘భీమా’ ఓవరాల్ ఆక్యుపెన్సీ 30 శాతానికి పడిపోగా.. ‘గామి’ స్టడీగా 52 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆక్యుపెన్సీ, కలెక్షన్స్, మౌత్ టాక్, బజ్.. ఇవన్నీ బేరీజు వేసుకుంటే ఈ శివరాత్రి విజేత ‘గామి’నే అని ట్రేడ్ ఎక్స్​పర్ట్స్ కూడా చెబుతున్నారు. మరి.. ‘గామి’, ‘భీమా’ సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ద్యావుడా.. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?