iDreamPost
android-app
ios-app

దేవర ‘ఆయుధ పూజ’ సాంగ్ రిలీజ్ కు రెడీ.. తారక్ ఫ్యాన్స్ శివాలెత్తడం ఖాయం!

  • Published Sep 13, 2024 | 2:22 PM Updated Updated Sep 13, 2024 | 2:22 PM

Devara Movie 'Ayudha Pooja' Song Update: ప్రస్తుతం తారక్ అభిమానులను అంతా దేవర హైప్ లోనే ఉన్నారు. మూవీ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దాదాపు మూవీ నుంచి రావాల్సిన అప్ డేట్స్ అన్ని వచేసినట్లే. ఆ ఒక్కటి తప్ప. అదే ఆయుధ పూజ సాంగ్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Devara Movie 'Ayudha Pooja' Song Update: ప్రస్తుతం తారక్ అభిమానులను అంతా దేవర హైప్ లోనే ఉన్నారు. మూవీ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దాదాపు మూవీ నుంచి రావాల్సిన అప్ డేట్స్ అన్ని వచేసినట్లే. ఆ ఒక్కటి తప్ప. అదే ఆయుధ పూజ సాంగ్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 13, 2024 | 2:22 PMUpdated Sep 13, 2024 | 2:22 PM
దేవర ‘ఆయుధ పూజ’ సాంగ్ రిలీజ్ కు రెడీ.. తారక్ ఫ్యాన్స్ శివాలెత్తడం ఖాయం!

కొరటాల శివ – తారక్ ఓ దేవర. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఎవరిని కదిలించినా కానీ.. దేవర హైప్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఫ్యాన్స్ అంతా ఈ సినిమా పక్కా హిట్ కొట్టేస్తుందనే ఊపులోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా దేవర కు అనుకూలంగానే ఉన్నాయి. ఆ సమయంలో వేరే ఏ సినిమాలు పోటీ లేకపోవడంతో.. కచ్చితంగా థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించడం ఖాయం. ఇక ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. దాదాపు ఇప్పటికే మూవీ నుంచి రావాల్సిన అప్ డేట్స్ అన్ని కూడా వచ్చేశాయి. ఆ ఒక్కటీ తప్ప. అదే ఆయుధ పూజ సాంగ్. ఈ సాంగ్ మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చేశారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటికి దేవర మూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ చేసారు మేకర్స్. ఈ మూడు పాటలు కూడా మూవీ రిలీజ్ కు ముందే.. రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఆ తర్వాత ఈ మూవీ నుంచి రాబోయే పాట ఆయుధ పూజ సాంగ్. ఆల్రెడీ ఈ సాంగ్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సాంగ్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతుందని మూవీ టీమ్ చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. మూవీ రిలీజ్ కు ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈ క్రమంలో వచ్చే వారంలో ఆయుధ పూజ సాంగ్ వస్తుందని అనౌన్స్ చేశారు లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి. దీనితో ఈ ఆయుధ పూజ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి మొదలైంది.

ఇక ఈ సినిమాకు అనిరుద్ అందించిన మ్యూజిక్.. నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సాంగ్ కరెక్ట్ గా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్రెడీ దేవర సినిమాపై విపరీతమైన బజ్ ఉండడంతో.. మూవీకి సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ వచ్చినా కానీ అభిమానులు వెంటనే ఎలెర్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందే దేవర సగం హిట్ అయిందని చెప్పి తీరాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.