iDreamPost
android-app
ios-app

ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే.. లిస్ట్ ఇదే

  • Published Jan 27, 2024 | 8:45 PM Updated Updated Jan 27, 2024 | 8:45 PM

జనవరి సందడి ముగిసింది. ఇక ఫిబ్రవరి హడావుడి మొదలైంది.. ఎక్కడ అనుకుంటున్నారా.. థియేటర్ల దగ్గర. సంక్రాంతి బరిలో బడా సినిమాలు అలరించాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఇంచు మించు 15కు పైగా సినిమాలు రాబోతున్నాయి.

జనవరి సందడి ముగిసింది. ఇక ఫిబ్రవరి హడావుడి మొదలైంది.. ఎక్కడ అనుకుంటున్నారా.. థియేటర్ల దగ్గర. సంక్రాంతి బరిలో బడా సినిమాలు అలరించాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఇంచు మించు 15కు పైగా సినిమాలు రాబోతున్నాయి.

  • Published Jan 27, 2024 | 8:45 PMUpdated Jan 27, 2024 | 8:45 PM
ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే.. లిస్ట్ ఇదే

జనవరిలో అనేక సినిమాలు సందడి చేశాయి. నువ్వా నేనా అంటూ సంక్రాంతి బరిలో దిగిన మూవీస్ మంచి హిట్ టాక్ అందుకున్నాయి. హనుమాన్, గుంటూరు కారం ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. రికార్డుల మోత మోగించాయి.  అలాగే ఫిబ్రవరిలో కూడా మూవీ లవర్స్‌ను ఎంటర్ టైన్ చేసేందుకు కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. వీటిల్లో సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న రవితేజ ఈగల్ మూవీ.. వచ్చే నెలలోనే రాబోతుంది.  సుమారు 15 మూవీస్ థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక ప్రతి శుక్రవారం థియేటర్ల దగ్గర ఓ పండుగ వాతావరణం కనిపించనుంది.

ఫిబ్రవరిలో తెలుగు సినిమాలతో పాటు ఇంగ్లీష్, తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా అలరించబోతున్నాయి. ఫిబ్రవరి మొదటి శుక్రవారం అంటే 2వ తేదీన గేమ్ ఆన్ అనే మూవీ విడుదల కాబోతుంది. సుహాస్ హీరోగా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ కూడా ఆ రోజే రాబోతుంది. ఓటీటీ స్టార్ నరేష్ నరేష్ అగస్త్య కిస్మత్ అంటూ వస్తున్నాడు. బూట్ కట్ బాలరాజు, హ్యాపీ ఎండింగ్ వంటి చిత్రాలు వచ్చే నెల తొలి శుక్రవారమే రాబోతున్నాయి. ఇక రెండో వారం నుండి అసలు సిసలైన సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పిన ఓ నాయకుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన యాత్ర -2 ఫిబ్రవరి ఎనిమిది రాబోతుంది. అలాగే సంక్రాంతి రేసు నుండి తప్పుకోబోతున్న ఈగల్.. అనుకున్నట్లుగానే సింగిల్ రిలీజ్ మూవీగా రాబోవడం లేదు.

ఊరి పేరు భైరవ కోన ఆ రేసు నుండి తప్పుకున్నప్పటికీ.. ఇంకొక పెద్ద సినిమా రాబోతుంది. అదే లాల్ సలామ్. సూపర్ స్టార్ రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 9నే తమిళనాట విడుదల కానుంది. అదే రోజు తెలుగులో అవకాశాలు ఉన్నాయి. ఎట్టకేలకు చర్చలు ఫలించాయి సందీప్ కిషన్ సినిమా విషయంలో.  ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవకోన రాబోతుంది. అలాగే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, సుందరం మాస్టార్, మేడమ్ వెబ్ సినిమాలు అదే రోజు వస్తున్నాయి. చివరి వారంలో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంతోష్ శోభన్ .. జోరుగా హుషారుగా షికారు పోదామా అనే సినిమా రాబోతుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడారా స్వామి వస్తున్నాయి. మరీ వీటిల్లో ఏ సినిమా అలరించనుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss