iDreamPost
android-app
ios-app

Chiranjeevi: ఫాంటసీలు మెగాస్టార్‌కి కొత్తకాదు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తొలిసారి ఆయన ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్టు, తొలిసారి ఇంత హై బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నట్టు రాయడానికి.. మెగాఅభిమానులు సీరియస్ గానే తీసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తొలిసారి ఆయన ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్టు, తొలిసారి ఇంత హై బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నట్టు రాయడానికి.. మెగాఅభిమానులు సీరియస్ గానే తీసుకున్నారు.

Chiranjeevi: ఫాంటసీలు మెగాస్టార్‌కి కొత్తకాదు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రకరకాల విధాలుగా సినిమాలోని హైలైట్స్ పట్టుకోవడానికి, పాఠకుల ముందు ఆరబోయడానికి సోషల్ మీడియా విశ్వ.. ప్రయత్నం చేస్తోంది. కానీ విశ్వంభర నుంచి సరైన ఆపీషియల్ అపడేట్ మాత్రం ఎక్కడా ఉప్పందలేదు. కాకపోతే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తొలిసారి ఆయన ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్టు, తొలిసారి ఇంత హై బడ్జెట్ చిత్రలో నటిస్తున్నట్టు రాయడానికి మెగాఅభిమానులు సీరియస్ గానే తీసుకున్నారు. నిజమే.. వారి ఆగ్రహం కొంతవరకూ సమంజసమే. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ డేస్ లో ఫాంటసీలు బాగా వచ్చాయి. అవి ల్యాండ్ మార్కుగా కూడా నిలిచిపోయాయి అన్నది చరిత్ర. విఠలాచార్య అనంతరం రీజనబుల్ బడ్జెట్లో ఫాంటసీలు చేయగలిగే సమర్ధత, ఆ నైపుణ్యం లేక దర్శకులు పూర్తిగా ఫాంటసీల జోలికే వెళ్ళడం మానేశారు. నిర్మాతలు కూడా చేతులు దులిపేసుకున్నారు.

కానీ మెగాస్టార్ స్టామినా ఏంటో ఆయన ఒకసారి రుచిచూపించిన తర్వాత కొందరికి ఆయనతో ఫాంటసీలు తీయాలన్న ఆలోచన వచ్చినప్పటికీ దమ్ము, సొమ్ము రెండిటికీ భయపడి వెనక్కి తగ్గారు. అప్పుడే వైజయంతీ మూవీస్ అధినేత, అగ్రనిర్మాత అశ్వనీదత్ చలసాని అత్యంత ధైర్యవంతంగా ముందుకొచ్చారు. అదే జగదేకవీరుడు అతిలోకసుందరి. అప్పటికే ఫ్లాపులతో వెనకబడ్డ రాఘవేంద్రరావుని దర్శకుడిగా పెట్టుకోవాలనుకుంటే ట్రేడ్ అంతా ఎదురు తిరిగింది. అశ్వనీదత్ మీద విరుచుకుపడింది. కానీ ఆ ప్రపోజల్ని సపోర్ట్ చేసింది మెగా మనసే. ఆయన ప్రతిభని మాత్రమే గుర్తించి, ఫ్లాపులను పరిగణించకుండా ఆయన చేతికి మెగాఫోన్ అందించేందుకు అశ్వనీదత్ కి వెన్నంటి నిలబడింది మెగాస్టార్. అదప్పటికి దారుణమైన బడ్జెట్. సెట్స్, శ్రీదేవి, మెగాస్టార్, ఇళయరాజా అన్నీ హై స్టేక్సే. అన్నిటినీ మించి, జగదేకవీరుడు.. దుమ్ము లేపేసింది. చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. కథా చర్చల్లో సైతం పాల్గొని కథకి విలువని, బలాన్ని కూడా ఏర్పరిచింది మెగాస్టార్ అన్న విషయం అశ్వనీదత్ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. అప్పటికి ఇండియా మొత్తంలోనే ఫాంటసీ అన్న ఊసే లేదు.

తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మెగాస్టార్ తో బ్రహ్మాండమైన ఫాంటసీని తలపెట్టారు. మొదటి విఐపి సినిమా డైరెక్టర్ విజువల్స్ బాగా తీశాడని ముచ్చటపడి అంజి సినిమాకి డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఎందుకో సింక్ కుదరక మళ్ళీ సురేష్ క్రిష్టని పెట్టారు. ఆయనకి కూడా కుదరలేదు. చివరికి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి బాగా అచ్చొచ్చిన డైరెక్టర్క కోడి రామక్రిష్ణతో సెటిల్ అయ్యారు. చిరంజీవికి ఆల్ క్లాసెస్ ఆడియన్స్ తో పాటు, చిన్నపిల్లలు అత్యధికంగా ఫాన్స్ ఉన్నారనే నిజాన్ని పరిగణనలోకి తీసుకుని, ఒక అజరామరమైన సినిమా తీయాలనే గట్టి పట్టుదలతో ఖర్చుకు వెనుకాడకుండా అంజి సినిమాని నిర్మించారు శ్యామ్. ఫారెన్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ అంజి ఆ రోజుల్లో. కానీ కాలయాపన అయిపోయి, రిలీజు కూడా లేటైపోయి, మొత్తానికి అంజి సినిమా జగదేకవీరుడు….అంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. కానీ ఈ రోజున న్యూ జనరేషన్ దర్శక ఔత్సాహికులు అంజి సినిమాని ఓ కల్ట్ సినిమాగా, లైబ్రరీ ఎడిషన్లా అభినందిస్తుంటారు. అంజిని పదేపదే ఫాలో అవుతుంటారు. అంత గొప్ప సినిమా అంజి. కానీ కమర్షియల్గా నిరూపించుకోలేకపోయింది. మెగాస్టార్ ఎన్ని రోజులు కష్టపడి పనిచేశారో లెక్కలేదు. అంజి అని టైటిల్ పెట్టినందుకు అంజి వర్షం( ఐదేళ్ళు) సినిమా నిర్మాణం జరిగింది.

ఇప్పుడు ముచ్చటగా మూడోది.. విశ్వంభర. వశిష్ట కథని ఫస్ట్ సిట్టింగులోనే ఓకే చేసి, ముందకు నడిపించారు మెగాస్టార్. ఇప్పుడున్న పాన్ ఇండియా మార్కెట్ పరంగా, టెక్నికల్ వేల్యూస్ పరంగా విశ్వంభర కాస్ట్లీయస్ట్ ప్రాజెక్టన్నది గ్యారెంటీ. యువి క్రియేషన్స్ కి ఇది హై స్టేకే. కానీ, కథ మీద, చిరంజీవి పార్టిసిపేషన్ మీద నమ్మకంతో యువి క్రియేషన్స్ ఖర్చుకి వెనుకాడకుండా దమ్ముగా నిర్మిస్తున్నారు.
అప్ కోర్స్.. యముడికి మొగుడు కూడా ఫాంటసీయే. కాకపోతే అది స్టాండర్డ్ ఫార్ములా. నాలుగైదు సార్లు తెలుగు ఒక్క లాంగ్వేజ్ లోనే వచ్చిన కంటెంటె అది. ఎన్టీ ఆరే రెండు సార్లు చేశారు. దేవాంతకుడు,యమగోల రెండూ ఒకటే. యముడికి మొగుడు అన్నిటినీ మించిన అతిపెద్ద బ్లాక్ బస్టర్. కాబట్టి, మెగాస్టార్ కి ఫాంటసీలు, అత్యధిక బడ్జెట్టులు కొత్తకాదన్నది అభిమానుల వాదన. అందులో నిజం లేకపోలేదు.