iDreamPost
android-app
ios-app

Devara: దేవరలో సింహాద్రి రేంజ్ NTR! 21 ఏళ్ళ తరువాత అసలైన మాస్!

  • Published Aug 13, 2024 | 12:01 PM Updated Updated Aug 13, 2024 | 12:08 PM

దేవర మూవీలో సింహాద్రి రేంజ్ యంగ్ టైగర్ ను చూడబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దాంతో 21 ఏళ్ల తర్వాత మాస్ జతర చూడబోతున్నాం అంటూ తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

దేవర మూవీలో సింహాద్రి రేంజ్ యంగ్ టైగర్ ను చూడబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దాంతో 21 ఏళ్ల తర్వాత మాస్ జతర చూడబోతున్నాం అంటూ తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 13, 2024 | 12:01 PMUpdated Aug 13, 2024 | 12:08 PM
Devara: దేవరలో సింహాద్రి రేంజ్ NTR! 21 ఏళ్ళ తరువాత అసలైన మాస్!

ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సీన్లు ట్రెండ్ సెట్టర్స్ గా నిలుస్తుంటాయి. అవి యాక్షన్స్ సీన్స్ కావొచ్చు.. కామెడీ సీన్స్ కావొచ్చు. ఇక వాటిని ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని యాక్షన్ సీన్స్ టీవీల్లో కనిపిస్తే చాలు.. గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇలాంటి సీన్లలో సింహాద్రి మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కత్తి పట్టుకుని నరికే సీన్లు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మళ్లీ 21 ఏళ్ల తర్వాత దేవర మూవీలో సింహాద్రి రేంజ్ లో ఆయుధం పట్టుకుని నరుకుడు మెుదలుపెట్టాడు తారక్. దేవర కనిపించే ఆ 10 నిమిషాలు థియేటర్లు షేక్ అవ్వాల్సిందే అంటున్నారు మేకర్స్.

సింహాద్రి.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో 2003లో వచ్చిన చిత్రం. ఇక ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా సింహాద్రి నిలిచింది. ఇక ఈ మూవీలో జక్కన్న డిజైన్ చేసిన ప్రత్యేక ఆయుధం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఆ కత్తితో సింహాద్రి నరికిన నరుకుడు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలా ఉండిపోయింది అంటే అతిశయోక్తికాదు. ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ నరుకుడు తారక్ ఏ సినిమాలో చేయలేదు. కానీ.. 21 ఏళ్ల తర్వాత దేవర మూవీలో ఆ రేంజ్ నరకుడు ఉందట. ఈ మూవీ కోసం స్పెషల్ ఆయుధాన్ని కొడవలి కత్తిని డిజైన్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. దానికి సంబంధించిన పిక్ ను కూడా ఇటీవలే రివీల్ చేశారు మేకర్స్.

Simhadri Range NTR in Devara!

దేవర మూవీలో రెండో పాత్ర ఎంట్రీ ప్రేక్షకులు సైతం ఊహించని రేంజ్ లో ఉంటుందట. ఆయుధ పూజ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ పాత్ర ఎంట్రీ అవుతుందట. 10 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీన్స్ లో తారక్ కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్తుంటే గూస్ బంప్స్ రావడం పక్కా అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ దృశ్యాలు చాలా వైల్డ్ గా విజువల్ వండర్ గా కూడా ఉంటాయట. 21 ఏళ్ల కింద సింహాద్రిలో నరికిన నరుకుడు.. మళ్లీ దేవరలోనే నరికాడు తారక్. ఈ పది నిమిషాలు దేవరలో మరో సింహాద్రి కనిపిస్తాడని, దాంతో థియేటర్లు ప్రేక్షకుల ఈలలు, గోలతో దద్దరిల్లడం ఖాయం అంటున్నారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దేవరలో తారక్ పాత్ర ఏ రేంజ్ లో ఊరమాస్ గా ఉంటుందో. రెండు దశాబ్దాల తర్వాత తారక్ ఫ్యాన్స్ కు దేవరతో అసలైన మాస్ జాతర మెుదలుకాబోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి తారక్ మాస్ జాతర కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss