iDreamPost
android-app
ios-app

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’కి కొత్త టెన్షన్! నిరాశలో ఫ్యాన్స్..

  • Published Aug 05, 2024 | 4:57 PM Updated Updated Aug 05, 2024 | 4:57 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ విషయంలో ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మెుదలైంది. ఇది కాస్త వారిని నిరాశకు గురిచేస్తోంది. మరి ఆ టెన్షన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ విషయంలో ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మెుదలైంది. ఇది కాస్త వారిని నిరాశకు గురిచేస్తోంది. మరి ఆ టెన్షన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 05, 2024 | 4:57 PMUpdated Aug 05, 2024 | 4:57 PM
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’కి కొత్త టెన్షన్! నిరాశలో ఫ్యాన్స్..

అగ్రదర్శకుడు శంకర్-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిరిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి వచ్చిన లీకులతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పైగా క్రిస్మస్ కు థియేటర్లలోకి వస్తున్నాం అంటూ దిల్ రాజు అనౌన్స్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ సంతోషంలో ఎగిరిగంతులు వేస్తున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు కొత్త టెన్షన్ మెుదలైనట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ కు కొత్త టెన్షన్ మెుదలైందా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లేటెస్ట్ టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్ అనుకున్న టైమ్ అంటే క్రిస్మస్ కు థియేటర్లకు వచ్చేలా లేదట. దానికి కారణం షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే అని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇంకా 15 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందట. పైగా కొత్త లొకేషన్స్ కోసం శంకర్ ప్లేసులు వెతుకుతున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ కల్లా రెడీ అవ్వాలంటే చాలా వేగంగా కష్టపడాల్సి ఉంటుంది.

Game Changer

ప్రస్తుతం శంకర్ స్పీడ్ చూస్తుంటే.. అభిమానులకు టెన్షన్ తప్పట్లేదు. డిసెంబర్ లో మూవీ వచ్చేలా కనిపించడం లేదన్నది కొందరి నెటిజనుల వాదన. ఈ విషయం కాస్త పరిశ్రమలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. నిన్నటి వరకు డిసెంబర్ లో తమ హీరోను వెండితెరపై చూస్తామని సంతోషంలో ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ మెుదలైంది. ఇదిలా ఉండగా.. ఒకవేళ క్రిస్మస్ కు రాకపోతే.. జనవరిలో వద్దామంటే సంక్రాంతికి చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇప్పటికే చిరు విశ్వంభర, అనిల్ రావిపూడి-వెంకీ మూవీతో పాటుగా మరికొన్ని చిత్రాలు విడుదలౌతున్నాయి. ఇక ఏప్రిల్ లో ప్రభాస్ రాజా సాబ్, ఆ నెక్ట్స్ విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి వీడీ 12 వస్తుండటంతో.. ఎవరితోనూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే మార్చిలో వస్తేనే బెటర్ అని దిల్ రాజు భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet