iDreamPost
android-app
ios-app

Ravi Teja: రవితేజ మారాలి బాస్! మా వెంకీ ఎక్కడ? అర్ధం అవుతుందా?

  • Published Feb 09, 2024 | 6:06 PM Updated Updated Feb 09, 2024 | 6:06 PM

మాస్ మహారాజ్ రవి తేజ నటించిన "ఈగల్" చిత్రం భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో విడుదల అయింది. మరి, ఈ సినిమా అంచనాలను నిలబెట్టుకుందా ? అసలు అభిమానులు ఈ చిత్రం గురించి ఏం అనుకుంటున్నారు? అనే విషయాలు చూద్దాం.

మాస్ మహారాజ్ రవి తేజ నటించిన "ఈగల్" చిత్రం భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో విడుదల అయింది. మరి, ఈ సినిమా అంచనాలను నిలబెట్టుకుందా ? అసలు అభిమానులు ఈ చిత్రం గురించి ఏం అనుకుంటున్నారు? అనే విషయాలు చూద్దాం.

  • Published Feb 09, 2024 | 6:06 PMUpdated Feb 09, 2024 | 6:06 PM
Ravi Teja: రవితేజ మారాలి బాస్! మా వెంకీ ఎక్కడ? అర్ధం అవుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ చిత్రాలను .. తీయాలంటే అది కేవలం రవి తేజకే సాధ్యం. అందుకే అభిమానులు ఆయనను మాస్ మహారాజ్ అని పిలుచుకుంటారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సినిమాలాలోకి అడుగుపెట్టి .. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ.. మాస్ మహారాజ్ రవి తేజగా ఇండస్ట్రీలో నిలిచిపోయారు. ఎదో సినిమాలో ఈ హీరో చెప్పినట్టుగానే.. సినిమా హిట్ అయినా మరో సినిమా తీయాలి .. సినిమా ప్లాప్ అయినా మరో సినిమా తీయాలి అన్నట్లు.. హిట్లు , ప్లాపులు తో సంబంధం లేకుండా.. ప్రతిసారి ఎదో ఒక కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు రవితేజ. ఈ క్రమంలోనే రవితేజ తాజాగా నటించిన చిత్రం “ఈగల్”. సంక్రాంతికి బరినుంచి పోస్ట్ పోన్ అవుతూ ఫిబ్రవరి 9న థియేటర్ లో విడుదలైంది. భారీ అంచనాల మధ్యన విడుదలైన ఈ చిత్రం టాక్ ఎలా ఉంది! ఎంతో ఈగర్ గా “ఈగల్” కోసం వెయిట్ చేసిన అభిమానులు ఏం అనుకుంటున్నారు! ఆ వివరాలు తెలుసుకుందాం.

గత కొన్ని రోజులుగా “ఈగల్ ” చిత్రం ప్రమోషన్లు మొదలైనప్పటినుంచి ఒక్కొక్కటిగా.. చిత్ర బృందం క్రేజీ అప్ డేట్స్ ను ఇస్తూనే ఉన్నాయి. దీనితో .. అటు మీడియాలోనూ , సోషల్ మీడియాలోనూ “ఈగల్” పై ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీనితో భారీ అంచనాల నడుమ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అయిన “ఈగల్”.. థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే, ఊహించినంత రేంజ్ లో ఈ చిత్రం లేకపోవడం ఆశ్చర్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఈ చిత్రం గురించి మిక్సడ్ టాక్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతోందని థియేటర్స్ కు వెళ్లిన అభిమానులు .. మిక్సడ్ టాక్ తో బయటకు రాడానికి కారణం.. రవి తేజ మీద ఎక్కువ ఎక్స్పెక్టషన్స్ పెట్టుకోవడమేనా! అసలు రవి తేజలో ఉన్న మాస్ మహారాజ్ ఏమైపోయాడు? రవితేజ మారాలి బాస్! మా వెంకీ ఎక్కడ? మీ సినిమాలలో ఉండే ‘కిక్’ ఏమైపోతుంది! అర్ధం అవుతుందా! అంటూ అభిమానులు భావిస్తున్నారు.

అసలు సాధారణంగా రవి తేజ సినిమా అంటే.. అందరు ఫుల్ మీల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకప్పటి రవి తేజ సినిమాలు చూసినట్లైతే.. ఫ్యామిలీ ఎమోషన్,లవ్, కామెడీ, రివెంజ్, యాక్షన్ ఇలా అన్ని కలబోసిన చిత్రంగా.. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిని ఆకట్టుకునేవి. కానీ, ఈ మధ్యన మాత్రం రవి తేజ ఎక్కువగా యాక్షన్ సినిమాలనే తీస్తున్నట్లుగా అనిపిస్తుంది. యాక్షన్ సినిమాలు కొంతవరకు ఆకట్టుకున్నా సరే.. అప్పట్లో రవి తేజ చేసిన వెంకీ, భద్ర , బలాదూర్, దుబాయ్ శీను , కిక్ లాంటి చిత్రాలు మాత్రం .. రవి తేజ కేరీర్ లో ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాలుగా నిలిచిపోతాయి. మళ్ళీ ఇప్పుడు రవి తేజ నుంచి అలాంటి ఓ ఫుల్ మీల్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మరి, ఈసారైనా మాస్ మహారాజ్ అభిమానుల కోరిక తీరుస్తాడో లేదో చూడాలి. ఏదేమైనా , రవి తేజ అంటే మాత్రం ప్రేక్షకులలో ఎప్పటికి ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇక ప్రస్తుతం “ఈగల్” సినిమాకు మిక్సడ్ టాక్ నడుస్తోంది. రానున్న రోజుల్లో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş