iDreamPost
android-app
ios-app

Akshay Kumar: బడే మియాన్ ఛోటే మియాన్.. ట్రైలర్ పైనే అందరి కళ్ళు

  • Published Mar 17, 2024 | 3:23 PM Updated Updated Mar 17, 2024 | 3:23 PM

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ 'బడే మియాన్ ఛోటే మియాన్' థియేట్రికల్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి 26న ఈ ట్రైలర్ విడుదల కానుంది.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ 'బడే మియాన్ ఛోటే మియాన్' థియేట్రికల్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి 26న ఈ ట్రైలర్ విడుదల కానుంది.

  • Published Mar 17, 2024 | 3:23 PMUpdated Mar 17, 2024 | 3:23 PM
Akshay Kumar: బడే మియాన్ ఛోటే మియాన్.. ట్రైలర్ పైనే అందరి కళ్ళు

ఈద్ సీజన్ హిందీ సినిమాలకు బెస్ట్ సీజన్లలో ఒకటిగా పేరుగాంచింది. గతంలో ఈద్ సందర్భంగా బాలీవుడ్ లో కిక్, బజరంగీ భాయిజాన్, చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి భారీ హిట్స్ వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈద్ సందర్భంగా విడుదలైన రన్ వే 34, హీరోపంతి 2, కిసీ కా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఈ సంవత్సరం రంజాన్  కానుకగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘బడే మియాన్ ఛోటే మియాన్’ ఏప్రిల్ 10న విడుదల కానుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ మెరుగ్గా ఉంటుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు ఆశిస్తున్నారు.

బడే మియాన్ ఛోటే మియాన్ టీజర్ బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చిన మూడు పాటలు – టైటిల్ ట్రాక్, మస్త్ మలంగ్ ఝూమ్, వాలా హబీబీ – ఇవన్నీ సరైన విధంగా ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయాయి. అక్షయ్ కుమార్ అభిమానులు కూడా పాటలను విమర్శిస్తూ, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా ఇలాంటి చెత్త పాటలు ఇచ్చారేంటని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. మార్చి 26న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ట్రైలర్ గనక అనుకున్న విధంగా ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైతే బడే మియా ఛోటే మియాకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే? భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఎంతో అవసరం.

అలాగే హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరికీ ఒక హిట్ అవసరం ఎంతైనా ఉంది. అందుకే సీక్వెల్ క్రేజ్ తో అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన బడే మియాన్ ఛోటే మియాన్లో మనుషి చిల్లర్, అలయా ఎఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హాలు కీలక పాత్రలు చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.

ఇదికూడా చదవండి: కార్తీకేయ2 సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetvakti girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş