iDreamPost
android-app
ios-app

కార్తీకేయ2 సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్..

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. స్వయంభు కాకుండా ద ఇండియా హౌస్ చిత్రాలను ప్రకటించాడు. ఇప్పుడు తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన కార్తీకేయ సీక్వెల్‌పై ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. స్వయంభు కాకుండా ద ఇండియా హౌస్ చిత్రాలను ప్రకటించాడు. ఇప్పుడు తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన కార్తీకేయ సీక్వెల్‌పై ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

కార్తీకేయ2 సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం హ్యాపీ డేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 21న తండ్రిగా ప్రమోట్ అయినట్లు ప్రకటించాడు. మగ పిల్లాడు పుట్టినట్లు వెల్లడించాడు. తాజాగా బారసాల నిర్వహించగా.. ఆ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. కార్తీకేయ2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ హైదరాబాదీ కుర్రాడు. నిఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. చందు మొండేటి దర్శకత్వంలో 15 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ.. రూ. 150 కోట్లను పైగా కొల్లగొట్టింది. ఆ తర్వాత వచ్చిన 18 పేజేస్ ఓకే అనిపించినా, స్పై మాత్రం నిరాశ మిగిల్చింది. అంతేకాకుండా రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగా.. ఇప్పుడు మరో సినిమా ప్రకటించాడు.

తనకు హిట్ ఇవ్వడమే కాకుండా.. పాన్ ఇండియన్ లెవల్లో గుర్తింపు తెచ్చిన కార్తీకేయ సీక్వెల్‌లో నటించబోతున్నాడు. కార్తీకేయ 3 త్వరలోనే పట్టాలెక్కబోతుందని పేర్కొన్నాడు. ఇది కూడా చందు మొండేటి దర్శకత్వంలోనే ఉండబోతుంది. డా. కార్తీకేయ న్యూ అడ్వెంచర్ సూన్ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ అవ్వబోతుందో చెప్పలేదు. ప్రస్తుతం చందు మొండేటి.. తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే విడుదలైన టీజర్ నెట్టింట్లో దుమ్ము రేపుతోంది. ఈ సినిమా తర్వాతే.. చందు మొండేటి కార్తీకేయ 3ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు నిఖిల్ కూడా రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

స్వయంభు, ద ఇండియా హౌస్ అనే చిత్రాలను షురూ చేశాడు. స్వయంభులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. రాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇండియా హౌస్ జోహార్ ఫేం రామ్ వంశీ కృష్ణ దర్శకుడు. కార్తీకేయ 2కు నిర్మించిన అభిషేక్ అగర్వాల్.. ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్ డేట్ లేదు. ఈ రెండు చిత్రాల తర్వాతే.. చందు మొండేటి డైరెక్షన్లలో కార్తీకేయ 3 చేయబోతున్నాడు నిఖిల్.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet