iDreamPost
android-app
ios-app

ఏడేళ్లు.. రెండంటే రెండే సినిమాలు! ఇలా ఇంకెన్ని రోజులు!

  • Author ajaykrishna Updated - 01:26 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Updated - 01:26 PM, Tue - 12 September 23
ఏడేళ్లు.. రెండంటే రెండే సినిమాలు! ఇలా ఇంకెన్ని రోజులు!

ఇండస్ట్రీలో హీరోలు స్టార్డమ్ వచ్చాక సినిమాలు చేయకుండా సైలెంట్ గా ఉంటే ఫ్యాన్స్, ఆడియన్స్ ఏమాత్రం ఊరుకోరు. ఊరుకోరంటే.. కోపతాపాలేం కాదు. ఎందుకని సినిమాలు చేయకుండా ఇలా టైమ్. వేస్ట్ చేస్తున్నారని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఇంకొందరు రకరకాలుగా ట్రోలింగ్ మొదలు పెడతారు. కానీ.. ఫ్యాన్స్ మాత్రమే ఎప్పుడెప్పుడు కొత్త సినిమా అనౌన్స్ చేస్తారా అని ఓపికగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్న హీరో యష్ విషయంలో ఫ్యాన్స్ పరిస్థితి అలాగే ఉంది. కేజీఎఫ్ వచ్చి ఏడాదిన్నర దాటింది. అయినా కొత్త సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.

దీంతో ఇప్పుడు యష్ తదుపరి సినిమా ఏంటనే విషయంపై ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. యష్ నుండి ఎలాంటి స్పందన లేనప్పటికి.. పాన్ ఇండియా ఫేమ్ ఉంది కదా.. సాలిడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని ఫ్యాన్స్ సరిపెట్టుకోవచ్చు. కానీ.. కేవలం కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ఈ రెండు సినిమాల కోసం దాదాపు ఆరేళ్లు వెచ్చించాడు యష్. 2016లో మొదలైన కేజీఎఫ్.. 2018లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2022లో కేజీఎఫ్ 2 వచ్చింది. అది వచ్చి ఏడాదిన్నర కావడంతో ఏడేళ్లలో యష్ చేసింది రెండంటే రెండు సినిమాలేనా.. ఇది సబబు కాదు యష్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

ఇదిలా ఉండగా.. యష్ తదుపరి సినిమా విషయంలో కొంతకాలంగా ఎన్నో ఊహగానాలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ తీసిన ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ నర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడని.. లేదు లేదు మలయాళం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ తో ఓ సినిమా.. తమిళ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ తో నెక్స్ట్ సినిమా అంటూ వార్తలు వచ్చేశాయి. దీంతో హమ్మయ్య ఒకేసారి రెండు సినిమాలు లాక్ చేశాడని ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ.. ఇప్పటిదాకా ఆ ప్రాజెక్ట్స్ గురించి టాక్ ఒక్కటే గానీ.. ఏది అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. సో.. కథ మళ్లీ మొదటికి వచ్చింది. రీసెంట్ గా తాను ఫ్యాన్స్ ని ఉద్దేశించి.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు కష్టపడుతున్నాను, త్వరలో గుడ్ న్యూస్ చెబుతా అని చెప్పాడు. సరే అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి యష్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.