iDreamPost
android-app
ios-app

Family Star Censor Report: ఫ్యామిలీ స్టార్ సెన్సార్ రిపోర్ట్

  • Published Mar 30, 2024 | 6:55 PM Updated Updated Mar 30, 2024 | 6:55 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కి సంబంధించి ఓ టాక్ బయటకు వచ్చింది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కి సంబంధించి ఓ టాక్ బయటకు వచ్చింది.

  • Published Mar 30, 2024 | 6:55 PMUpdated Mar 30, 2024 | 6:55 PM
Family Star Censor Report: ఫ్యామిలీ స్టార్ సెన్సార్ రిపోర్ట్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాకి సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం.

ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌ని రిలీజ్ చేసిన టీమ్ మంచి స్పందనను రాబట్టుకుంది. కేవలం విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన సినిమా గీత గోవిందం. మరి అలాంటి భారీ హిట్ అందించిన పరశురామ్ – విజయ్ దేవరకొండల కాంబో నుండి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం సహజమే కదా.

family star sencor report

గీత గోవిందం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇటీవలే విడుదలైన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూస్తే గీత గోవిందం మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యేలానే ఉంది. ప్రధానంగా విజయ్ – మృణాల్ జంట కెమిస్ట్రీ చాలా బాగుంది. అలానే కుటుంబ సభ్యులతో విజయ్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఫ్యామిలీ స్టార్ చిత్ర బృందం కూడా సినిమా సక్సెస్ పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. తెలుగు కుటుంబాలు ఈ చిత్రాన్ని రాబోయే రోజుల్లో గుర్తుంచుకుంటాయని దర్శకుడు పరశురామ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక ఫ్యామిలీ స్టార్ రన్‌టైమ్ 160 నిమిషాలు. అంటే 2 గంటల 40 నిమిషాలు అన్నమాట. కాగా ఈ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్‌గా వచ్చిందట. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను అభినందించారట. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 45 కోట్లకు పైగానే జరిగింది. ఫ్యామిలీ స్టార్ డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది.