iDreamPost
android-app
ios-app

ఎఫ్3 మూడు రోజుల వసూళ్లు

  • Published May 30, 2022 | 5:16 PM Updated Updated May 30, 2022 | 5:30 PM
ఎఫ్3 మూడు రోజుల వసూళ్లు

ఊహించిన దానికన్నా పెద్దగా ఎఫ్3 దూసుకుపోతోంది. మొన్న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గ్రాండ్ గా ఫస్ట్ వీకెండ్ ని ముగించడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. సర్కారు వారి పాట నెమ్మదించాక చెప్పుకోదగిన సినిమా ఏదీ బాక్సాఫీస్ వద్ద రాలేదు. చిన్న సినిమాలను చూసేందుకు పబ్లిక్ అంతగా ఇంటరెస్ట్ చూపించకపోవడంతో స్టార్ వేల్యూ పుష్కలంగా ఉన్న ఎఫ్3కి బిసి కేంద్రాల్లో మంచి స్పందన దక్కుతోంది. కేవలం మూడు రోజులకే అరవై శాతానికి పైగా రికవరీ చేయడం మాములు విషయం కాదు. ఇదే దూకుడు ఇకపై వీక్ డేస్ లోనూ కొనసాగుతుందానేది వేచి చూడాలి. ఈ వారం మూడు కొత్త చిత్రాలు వస్తున్నాయి.

ఇక లెక్కల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 28 కోట్ల షేర్ దగ్గరగా వెళ్లిన ఎఫ్3 నైజామ్ లో రీజనల్ మూవీస్ లో కొత్త రికార్డు సృష్టించింది. టికెట్ రేట్ల పంచాయితీ ఎలా ఉన్నా తెలంగాణలో ఉన్న గరిష్ట జిఓ రేటే అమలు చేయడంతో వసూళ్లు బాగున్నాయి. ఇక్కడి కంటే మెరుగ్గా ఏపిలో తక్కువ ధరలకు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కారణంగా డ్రాప్ మరీ ఎక్కువగా ఉండకపోయే సూచనలు ఉన్నాయి. ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ కు అతి దగ్గరలో ఉంది ఎఫ్3. బ్రేక్ ఈవెన్ కు ఇంకో ముప్పై కోట్ల దూరంలో ఉన్న ఈ సినిమాకు అది కష్టమేమి కాదు కానీ ఇప్పుడీ టాక్ ని కనీసం పది రోజుల పాటు హోల్డ్ చేయడం అవసరం

నైజామ్ – 12 కోట్ల 20 లక్షలు
సీడెడ్ – 3 కోట్ల 55 లక్షలు
ఉత్తరాంధ్ర – 3 కోట్ల 35 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 85 లక్షలు
వెస్ట్ గోదావరి – 1 కోటి 52 లక్షలు
గుంటూరు – 2 కోట్ల 6 లక్షలు
కృష్ణా – 1 కోటి 77 లక్షలు
నెల్లూరు – 1 కోటి 15 లక్షలు

ఏపి తెలంగాణ మూడు రోజుల షేర్ – 27 కోట్ల 45 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 80 లక్షలు
ఓవర్సీస్ – 5 కోట్ల 20 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల టోటల్ షేర్ – 34 కోట్ల 45 లక్షలు

ఈ వారం విక్రమ్, మేజర్, సామ్రాట్ పృథ్విరాజ్ రిలీజవుతున్నాయి. ఏవీ ఎఫ్3 జానర్ కి పోటీ ఇచ్చేవి కాకపోవడం నిర్మాత దిల్ రాజుకి ఊరట కలిగించే అంశం. ఒకవేళ వాటిలో దేనికైనా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అప్పుడు ప్రభావం ఉంటుంది. ఇంకో వీకెండ్ ఈజీగా చేతిలో ఉన్నట్టే. జూన్ 10న నాని అంటే సుందరానికి వచ్చేదాకా కుటుంబ ప్రేక్షకుల ఫస్ట్ ఛాయస్ ఎఫ్3 నే అవుతుంది. దీన్ని కనక వాడుకుంటే ఈజీగా లాభాల్లోకి ప్రవేశించవచ్చు. యూనిట్ మాత్రం ప్రమోషన్లు ఆపడం లేదు. నాన్ స్టాప్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇవాళ మీడియా సమక్షంలో సక్సెస్ మీట్ చేశారు. ఇకపై స్టడీ సూత్రాన్ని పాటిస్తే చాలు ఎఫ్3 సూపర్ హిట్ స్టేటస్ ని దాటేస్తుంది