iDreamPost
android-app
ios-app

OG: ఒమీ భావుగా ఇంటెన్స్ లుక్ లో ఇమ్రాన్ హష్మీ

  • Published Mar 24, 2024 | 1:59 PM Updated Updated Mar 24, 2024 | 1:59 PM

దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ లుక్ ను స్టైలిష్ గా ప్రజెంట్ చేసిన ఓజీ గ్లింప్స్ ను అనేది ఓజీ టీమ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు తాజాగా ఓజీలో నటిస్తున్న మరొక బాలీవుడ్ నటుడు పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఆయన లుక్స్ చూసి ప్రేక్షకుల ఫిదా అయ్యారు.

  • Published Mar 24, 2024 | 1:59 PMUpdated Mar 24, 2024 | 1:59 PM
OG: ఒమీ భావుగా ఇంటెన్స్ లుక్ లో ఇమ్రాన్ హష్మీ

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక స్టైలిష్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లుక్ ను స్టైలిష్ గా ప్రజెంట్ చేసిన ఓజీ గ్లింప్స్ పవన్ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓజీ టీమ్ ఒక స్పెషల్ ట్రీట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఇమ్రాన్ పుట్టినరోజు కానుకగా ‘ఓమీ భావు’ పాత్రలో ఆయనను చూపిస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇమ్రాన్ లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి. సైడ్ యాంగిల్ లో ఇంటెన్స్ లుక్ లో సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఇమ్రాన్ ను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా ఓజీ సినిమాలో హీరో వెర్సస్ విలన్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కూడా అంటున్నారు. ‘ఓజీ’ చిత్రంతో ఇమ్రాన్ హష్మీ నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ దక్షిణాది చిత్రసీమకు పరిచయం కానున్నారు.

ఇటీవలే ‘టైగర్ 3’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించి ఆకట్టుకున్న ఇమ్రాన్ మరోసారి అదే తరహాలో నటనను కనబరుస్తారని, తన కెరీర్ లో ఇది మరొక కొత్త అధ్యాయానికి నాందిగా ఉంటుందని భావిస్తున్నారు. మరి పోస్టర్ లో ఉన్నట్టే తెర పై కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఇమ్రాన్ ప్రేక్షకులను కట్టిపడేస్తే ‘ఓజీ’ సినిమాతో పాటు ఆయన కెరీర్ కు కూడా ఈ పాత్ర బాగా ఉపయోగపడుతుంది. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే పైన చెప్పుకున్న విధంగా ఈ సినిమా పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఇండస్ట్రీ వార్తల ప్రకారం ఈ సినిమాలో పవన్ ఒక గ్యాంగ్స్టర్ తో పొలిటీషియన్ గా కూడా కనిపిస్తారట. సెప్టెంబర్ 27న ఓజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల అవుతుంది.

marsbahis girişjojobet girişjojobet