iDreamPost
android-app
ios-app

దుల్కర్ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్.. రితికాతో కలిసి ఊర మాస్ డ్యాన్స్!

  • Author singhj Published - 08:33 PM, Fri - 28 July 23
  • Author singhj Published - 08:33 PM, Fri - 28 July 23
దుల్కర్ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్.. రితికాతో కలిసి ఊర మాస్ డ్యాన్స్!

దుల్కర్ సల్మాన్.. తక్కువ వ్యవధిలోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటుల్లో ఒకరు. ఇక్కడ చేసింది తక్కువ సినిమాలే అయినా తన మార్క్ యాక్టింగ్​తో అభిమానుల హృదయాలను దోచుకున్నారు. మాతృభాష మలయాళంలో పెద్ద స్టార్​గా చలామణి అవుతున్న దుల్కర్.. తెలుగులోనూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే ఏదో కొత్తదనం ఉంటుందని మూవీ గోయర్స్ ఎక్స్​పెక్ట్ చేస్తుంటారు. దుల్కర్ కూడా రొటీన్ కథలు కాకుండా తాజాదనం ఉట్టిపడే స్టోరీస్​కే మొగ్గుచూపుతారు. ఆయన చేసిన చిత్రాలను చూస్తే ఇది అర్థమవుతుంది.

‘మహానటి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఫస్ట్ మూవీతోనే ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంతో తెలుగు నాట మరో హిట్ అందుకున్నారు. ఇక ‘సీతారామం’తో ఇక్కడి స్టార్ హీరోల స్థాయిలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దుల్కర్ నటించిన చిత్రమే ‘కింగ్ ఆఫ్ కోతా’. అభిలాష్ జోషి తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2023 ఓనమ్​ సందర్భంగా రిలీజ్​కు సిద్ధమవుతోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా అదే టైమ్​లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫిల్మ్ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆడియెన్స్​ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

‘కింగ్ ఆఫ్ కోతా’లో దుల్కర్ సల్మాన్ గ్యాంగ్​స్టర్​ రోల్​లో కనిపించనున్నారు. తన కెరీర్​లో ఎక్కువగా సాఫ్ట్ మూవీస్ చేస్తూ వచ్చారాయన. లవర్ బాయ్ రోల్స్ కూడా చాలానే చేశారు. అలాంటిది గ్యాంగ్​స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ‘కింగ్ ఆఫ్ కోతా’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా ‘అసురుడే రావణ’ అనే స్పెషల్ సాంగ్ రిలీజైంది. ఇందులో హీరోయిన్ రితికా సింగ్​తో కలసి దుల్కర్ ఊర మాస్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఈ పాట యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. మరి.. దుల్కర్ నటిస్తున్న ‘కింగ్ ఆఫ్ కోతా’ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş