iDreamPost
android-app
ios-app

బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్! ఊహించని కాంబో!

  • Published Nov 18, 2023 | 4:06 PM Updated Updated Nov 18, 2023 | 4:06 PM

దుల్కర్ సల్మాన్ మలయాళ పరిశ్రమలో తనను తాను నిరూపించుకుని ముందుకు సాగుతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు అయినప్పటికీ.. ఇండస్ట్రీలోకి తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నటనలో తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు..

దుల్కర్ సల్మాన్ మలయాళ పరిశ్రమలో తనను తాను నిరూపించుకుని ముందుకు సాగుతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు అయినప్పటికీ.. ఇండస్ట్రీలోకి తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నటనలో తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు..

  • Published Nov 18, 2023 | 4:06 PMUpdated Nov 18, 2023 | 4:06 PM
బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్! ఊహించని కాంబో!

‘నందమూరి బాలకృష్ణ’ పరిచయం అవసరం లేని పేరు. నట సార్వభౌముని నాయకత్వాన్ని, వారసత్వాన్ని అంతే హుందాగా పుణికిపుచ్చుకున్నాడు. 1974 లో విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో ప్రారంభమైన తన సినీ జీవితం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న యువ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా హిట్ చిత్రాలను అందిస్తూనే ఉన్నాడు బాలయ్య. కాగా.. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు ‘బాబీ’తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. “సితార ఎంటర్టైన్మెంట్” బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టుకుంది. అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం.

“మహానటి” చిత్రంతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు దుల్కర్. ఆ తర్వాత “కనులు కనులను దోచాయంటే”, “సీతారామం” చిత్రాలు ఈ హీరో కు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. తెలుగు అభిమానులకు దగ్గరైన మమ్ముట్టి కుమారుడు.. మళ్ళీ టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే కాదనగలరా మరీ.. ఈ హీరో కూడా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అది కూడా లెజెండరీ యాక్టర్ బాలయ్య బాబు తో. అయితే దుల్కర్ ఇప్పటివరకు అందరికీ లవర్ బాయ్ లానే పరిచయం. ఇటీవల విడుదలైన ‘కింగ్ ఆఫ్ కొత్త’ చిత్రంలో గ్యాంగ్ స్టార్ గా కూడా కనిపించాడు. ఇప్పుడిపుడే తెలుగు ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకుంటున్నాడు. మరి ఈ హీరో బాలయ్య ఎనర్జీకి మ్యాచ్ చేయగలుగుతాడా ! వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ! ఈ చిత్రంలో ఎటువంటి పాత్రను పోషించబోతున్నాడు! అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

ఇక దర్శకుడు బాబీ ప్రీ లుక్ లో గొడ్డలి , దానిమీద రేబాన్ గాగుల్స్ తో వినూత్నమైన రేంజ్ లో మాస్ గా ఉండబోతుందని క్లూ ఇచ్చేశాడు. క్యాస్టింగ్ విషయంలోనూ క్రేజీగా వెళ్తున్నాడని టాక్. వీర సింహరెడ్డి ఫేమ్ హనీరోజ్ తో పాటు కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కూడా ఈ సినిమా కోసం సెలెక్టెడ్ లిస్ట్ లో ఉన్నారు. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు చాలా గెటప్స్ లో కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండబోతున్నాయి కనుక బాలయ్య బాబు పార్టీ ప్రచారంలో బిజీగా ఉండనున్నారు.

ఈలోపు ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. కాబట్టి షూటింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. తమన్ , దేవిశ్రీ ప్రసాద్ , అనిరుద్ ఇలా మూడు పేర్లు వినికిడిలో ఉన్నాయి. వీరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో వేచి చూడాలి. బాలయ్య బాబు నటిస్తున్న ఈ ‘ఎన్ బికె 109’ చిత్రానికి టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇక బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా బాలయ్య బాబు మరియు దుల్కర్ కాంబినేషన్ చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio