iDreamPost
android-app
ios-app

సేఫ్ జోన్ లోకి డబుల్ ఇస్మార్ట్ బిజినెస్.. ఎన్ని కోట్లంటే?

  • Published Aug 01, 2024 | 1:28 PM Updated Updated Aug 01, 2024 | 1:28 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ టాలెంటడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు తాజాగా ఈ సినిమాకు థియేట్రికల్ తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు భారీగా సమాకూరయట.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ టాలెంటడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు తాజాగా ఈ సినిమాకు థియేట్రికల్ తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు భారీగా సమాకూరయట.

  • Published Aug 01, 2024 | 1:28 PMUpdated Aug 01, 2024 | 1:28 PM
సేఫ్ జోన్ లోకి డబుల్ ఇస్మార్ట్ బిజినెస్.. ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ టాలెంటడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు ఛార్మికౌర్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.కాగా, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల (ఆగస్టు 15వ తేదీన) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ కానుంది. అయితే ఇంతకుముందు పూరి, రామ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మూవీ టీమ్ రెడీ అవుతున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామానని ప్రేక్షకులు  తెగ ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ మూవీకి భారీగా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కి ప్లానింగ్ జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ ను కూడా అమోజాన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి రూ.55 కోట్లకి అన్ని భాషలల్లో కొనుగోలు చేశారట. అయితే ఇప్పుడు నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయని సమాచారం తెలుస్తోంది. కాగా, డబల్ ఇస్మార్ట్ సినిమాకు నాన్ థీయాట్రికల్ రైట్స్  ఏకంగా రూ. 76 కోట్లు  పూరి టీమ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే  సౌత్ భాషల డిజిటల్ రైట్స్ అన్ని కలిపి రూ. 33 కోట్ల భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందంట. దీంతో పాటు  హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని కలిపి రూ. 35 కోట్లకి అమ్ముడయ్యాయి. అలాగే  ఆడియో రైట్స్ ని రూ. 8 కోట్లకి కొనుగోలు అయినట్లు  తెలుస్తోంది. అయితే  ఈ లెక్కన ప్రకారం నాన్ థీయాట్రికల్ బిజినెస్ ద్వారా పూరి కనెక్ట్స్ కి రూ. 76 కోట్లు ఆదాయం వచ్చినట్లు  తెలుస్తోంది. ఇలా మొత్తం మీదకి డబుల్ ఇస్మార్ట్ మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపితే రూ.130 కోట్లకు పైగా లెక్క తేలాయని సమాచారం.

ఇకపోతే రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాకు దాదాపు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే  అన్ని రికవరీ అయినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమా విషయంలో టేబుల్ ప్రాఫిట్ లోనే సేఫ్ జోన్ లోనే ఉన్నారని చెప్పవచ్చు.  అయితే రామ్ పోతినేని కెరియర్ లో మొదటిసారి హైయోస్ట్ బిజినెస్ గా డబుల్ ఇస్మార్ట్ నిలిచింది. ఇక ఈ సినిమా థియేటర్స్ లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోయే ఛాన్స్ ఉంది. కాగా, మూవీ టీమ్ ఈ సినిమాకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా టార్గెట్ పెట్టుకున్నారు. మరీ, మూవీ టీమ్ ఆశించిన మేరకు డబుల్ ఇస్మార్ట్ డబుల్ కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టిస్తుందో లేదో థియేటర్స్ లో రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. మరీ, రామ్ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్  పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.