Somesekhar
పోటీలో రవితేజ, విక్రమ్ మూవీలు ఉన్నప్పటికీ.. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది రామ్-పూరీ కాంబో. మరి తొలిరోజు డబుల్ ఇస్మార్ట్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం పదండి.
పోటీలో రవితేజ, విక్రమ్ మూవీలు ఉన్నప్పటికీ.. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది రామ్-పూరీ కాంబో. మరి తొలిరోజు డబుల్ ఇస్మార్ట్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం పదండి.
Somesekhar
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోటీలో రవితేజ, విక్రమ్ మూవీలు ఉన్నప్పటికీ.. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది రామ్-పూరీ కాంబో. ఇవి రామ్ కెరీర్ లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం.
డబుల్ ఇస్మార్ట్ మూవీకి టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటుగా తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. పుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 15 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 7 కోట్లు, కర్ణాటక నుంచి రూ. 50 లక్షలు, హిందీ నుంచి రూ. 50 లక్షలు వసూళ్ చేసింది. మెుత్తంగా ఇండియాలో రామ్ రూ. 9 కోట్లను కలెక్ట్ చేశాడు.
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికా, ఇతర ప్రాంతాల్లో కలిపి 3 కోట్లు నికరంగా, 6 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్లు సమాచారం. దాంతో రామ్ కెరీర్ లోనే ఇవి అత్యుత్తమ ఓపెనింగ్స్ గా నమోదు అయ్యాయి. ఒక పక్క మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్, మరో పక్క చియాన్ విక్రమ్ తంగలాన్ పోటీలో ఉన్నప్పటికీ.. డబుల్ ఇస్మార్ట్ భారీ ఓపెనింగ్స్ ను సాధించడం విశేషం. ముందు లాంగ్ వీకెండ్ ఉండటంతో.. వసూళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాంగ్ రన్ లో రామ్ మూవీ ఏ రేంజ్ లో సత్తాచాటుతుందో చూడాలి. మరి డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.