iDreamPost
android-app
ios-app

Double Ismart Censor Review: డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ! ప్రేక్షకులకు పండగేనట..

  • Published Aug 08, 2024 | 2:13 PM Updated Updated Aug 08, 2024 | 2:46 PM

డబుల్ ఇస్మార్ట్ మూవీకి సంబంధించి సెన్సార్ రివ్యూ వచ్చేసింది. సినిమా చూసిన బోర్డ్ సభ్యులు సర్టిఫికెట్ తో పాటుగా మూవీ ఏ రేంజ్ లో ఉందో చెప్పుకొచ్చారు. బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్ అని వారు పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

డబుల్ ఇస్మార్ట్ మూవీకి సంబంధించి సెన్సార్ రివ్యూ వచ్చేసింది. సినిమా చూసిన బోర్డ్ సభ్యులు సర్టిఫికెట్ తో పాటుగా మూవీ ఏ రేంజ్ లో ఉందో చెప్పుకొచ్చారు. బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్ అని వారు పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Double Ismart Censor Review: డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ! ప్రేక్షకులకు పండగేనట..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్. 2019లో వీరి కాంబోలోనే వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ట్రైలర్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ ను వీక్షించి, సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. మరి ఇప్పుడు సెన్సార్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి.

రామ్-పూరీల డబుల్ ఇస్మార్ట్ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు సర్టిఫికెట్ తో పాటుగా మూవీ ఏ రేంజ్ లో ఉందో తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. డబుల్ ఇస్మార్ట్ అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పూరీ, రామ్ లు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని తెలిపారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుందని పేర్కొన్నారు. దాంతో పాటుగా సంజయ్ దత్, రామ్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్లు ఆడియెన్స్ ను సీట్ ఎడ్జ్ న కూర్చోబెడతాయట. అదీకాక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా అని చెబుతున్నారు.

Ismart

ఇక హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుందని, టెక్నికల్ గా ఈ మూవీ చాలా రిచ్ గా ఉందని సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రశంసించారు. అభిమానులకు డబుల్ డోస్ ఖాయమని వారు తెలిపారు. ఇక ఈ మూవీకి ‘ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేయగా.. రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన రివ్యూను బట్టి చూస్తే.. డబుల్ ఇస్మార్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సెన్సార్ బోర్డ్ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by RAm POthineni (@ram_pothineni)