iDreamPost
android-app
ios-app

భగవద్గీతపై వీడియో.. క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి!

Bitthiri Sathi: భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై ర‌వికుమార్ కావ‌లి అలియాస్ బిత్తిరి సత్తి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింది. తాజాగా ఆ ఇష్యూపై బిత్తిరి సత్తి స్పందించారు.

Bitthiri Sathi: భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై ర‌వికుమార్ కావ‌లి అలియాస్ బిత్తిరి సత్తి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింది. తాజాగా ఆ ఇష్యూపై బిత్తిరి సత్తి స్పందించారు.

భగవద్గీతపై వీడియో.. క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి!

బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. తెలుగు టెలివిజన్ లో బిత్తిరి సత్తి ప్రత్యేకమైన యాస.. వెరైటీ భాషతో.. తనకంటూ గుర్తింపు సంపాదించాడు. తొలుత  న్యూస్ ఛానళ్లలో పొలిటికల్ సెటైర్లకు సంబంధించిన ప్రొగ్రామ్స్ చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేశాడు.  ఈ క్రమంలోనే బిత్తిరి సత్తి అనే పేరుతో చేసిన క్యారెక్టర్‌తో జనాల్లో నవ్వులు పూయిస్తుండటంతో పాటు తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే.. ఆయన ఇటీవల చేసిన వీడియో వివాదస్పదమైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇష్యూపై బిత్తిరి సత్తి  స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు.

బుల్లితెరపై తమ యాస, నటనలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వారిలో బిత్తిరి సత్తి ఒకరు. ఆయన చేసే స్క్రిప్ట్ లకు ఆడియన్స్ కడుబ్బా నవ్వుతారు. ఇంకా చెప్పాలంటే..బిత్తిరి సత్తి వీడియోలకే ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే.. భగవద్గీతపై చేసిన  వీడియోతో బిత్తిరి సత్తి వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై బిత్తిరి సత్తి తాజాగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ వీడియో విడుదల చేసి.. పలు విషయాలను వెల్లడించారు.

ఈ వీడియోలో బిత్తిరి సత్తి మాట్లాడుతూ… భగవద్గీతపై తాను సరదాగా చేసిన వీడియో మాత్రమేనని తెలిపాడు. కానీ, కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపాడు. తాను ఎప్పుడు చిన్న చిన్న క్లిప్స్, రీల్స్ పెడుతుంటాని తెలిపాడు. అదే విధంగా ఓ వీడియోలో చిన్న మిస్టేక్ వచ్చింది. తన అభిమానులు, బంధుమిత్రులు, తన శ్రేయోభిలాషులకు నిజంగా ఆ వీడియో కించపర్చినట్లు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నట్లు బిత్తిరి సత్తి తెలిపాడు.

తాను కూడా భ‌గ‌వ‌ద్గీతను ఆరాధిస్తాన‌ని, పారాయణం చ‌దువుతాన‌ని తెలిపారు. కానీ ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం.. తప్పకుండా ఎదుర్కొంటానని తెలిపాడు. కాగా, భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడంటూ రాష్ట్రీయ వాన‌ర‌సేన బుధ‌వారం హైద‌రాబాద్ సీసీఎస్‌లో బిత్తిరి సత్తిపై ఫిర్యాదు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా బిత్తిరి సత్తి తన వీడియోను రిలీజ్ చేశాడు. మరి..బిత్తిరి సత్తి ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.