Swetha
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలకు కొదవే ఉండదు. కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఇన్ని సినిమాలలో ఒకటి రెండు సినిమాలు అప్పుడప్పుడు ప్రేక్షకులు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమా కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలకు కొదవే ఉండదు. కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఇన్ని సినిమాలలో ఒకటి రెండు సినిమాలు అప్పుడప్పుడు ప్రేక్షకులు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమా కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే.
Swetha
ఓటీటీ మూవీస్ అంటే రకరకాల జోనర్స్ ఉంటాయి. మర్డర్ మిస్టరీస్, క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్.. ఇలా అన్ని రకాల జోనర్స్ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారు ఎంతో మంది ఉంటారు. అయితే వరుసగా ఓటీటీ లో అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిలో ఏ సినిమా బావుంది ఏ సినిమా బాలేదు.. ఏ సినిమా ఎప్పుడు చూడాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు అందరికి తెలుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ను మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీరు మిస్ అయిన సినిమాలలో కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఉన్నట్లయితే.. వెంటనే చూడాల్సిందే. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సినిమా పేరు విడుదల.. ఇది ఒక తమిళ సినిమా. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి అప్పట్లో బాగానే టాక్ వినిపించింది. ఈ సినిమా తమిళ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ లోను అందుబాటులో ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా 8.1 రేటింగ్ దక్కించుకుంది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఒక గ్రామంలో సూరి అనే వ్యక్తి పోలీస్ అధికారిక నియమితుడౌతాడు. అయితే అక్కడ ఉన్న ఉన్నతాధికారులు.. విలువైన వజ్రాలను తవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. ఈ క్రమంలో తన పై అధికారులతో అతనికి విబేధాలు ఏర్పడుతాయి.. పై అధికారులతో విభేదాలకు కారణం ఏమిటి? నిజాయితీ, నిబద్దతతో ఉద్యోగం చేసే అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ప్రేయసితో అతని ప్రేమ ఎలా సాగింది? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ.
ఇప్పటివరకు చూసిన క్రైమ్ థ్రిల్లర్స్ కనుక బోర్ కొడితే ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని చెప్పి తీరాలి. అయితే ఈ సినిమా జీ 5 ఓటీటీ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే కనుక వెంటనే చూసేయండి. క్రైమ్, సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ తరహాలో సాగే కథ ఇది. సాధారణంగా ఈ జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. వాళ్లకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.