iDreamPost
android-app
ios-app

డాన్ శీనులో శ్రియా ఫ్రెండ్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రేంజ్ ఊహించలేరు!

  • Published Aug 21, 2024 | 4:53 PM Updated Updated Aug 21, 2024 | 4:53 PM

గోపీచంద్ మలినేని తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటి డాన్ శీను. మాస్ మహారాజా రవితేజ, శ్రియా హీరో హీరోయిన్లు. ఇందులో శ్రియ స్నేహితురాలిగా, సెకండ్ హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..?

గోపీచంద్ మలినేని తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటి డాన్ శీను. మాస్ మహారాజా రవితేజ, శ్రియా హీరో హీరోయిన్లు. ఇందులో శ్రియ స్నేహితురాలిగా, సెకండ్ హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..?

  • Published Aug 21, 2024 | 4:53 PMUpdated Aug 21, 2024 | 4:53 PM
డాన్ శీనులో శ్రియా ఫ్రెండ్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రేంజ్ ఊహించలేరు!

మాస్ మహరాజా రవితేజ- గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన చిత్రం డాన్ శీను. 2010లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు.. 100 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాను హిందీలో రెండు సార్లు డబ్ కావడం విశేషం. అలాగే బెంగాలీలో రీమేక్ చేశారు. ఇక ఇందులో శ్రియా శరణ్, అంజనా సుఖానీ హీరోయిన్లు. శ్రీహరి, షియాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో రవితేజ శ్రియను ప్రేమిస్తూనే.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఫ్రెండ్‌ను ఫ్లట్ చేస్తుంటారు. శ్రియ స్నేహితురాలిగా, సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించింది అంజనా సుఖానీ. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా హిట్ కొట్టిన్నప్పటికీ.. ఆమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడం గమనార్హం.

టాలీవుడ్ ఛాన్సులు ఇవ్వకపోయినా, హిందీ ఇండస్ట్రీ ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది. బాలీవుడ్‌లో ఫేమ్ తెచ్చుకుంది అంజనా. రాజస్తాన్ జైపూర్ నివాసి అయిన ఈ బ్యూటీ.. విదేశాల్లో ఎంఎస్ చేసింది. ఆ తర్వాత మోడల్‌గా మారి అమితాబ్ బచ్చన్ సరసన క్యాడ్బరీ డైరీ మిల్క్ యాడ్ చేసింది. అలా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. అలా 2005లో హమ్ డమ్ అనే చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వడ్డే నవీన్ హీరోగా వచ్చిన నా ఊపిరి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మధు పాత్రలో మెప్పించింది. మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. సన్ జరా, జానా, సండే, గోల్ మాల్ రిటర్న్, జై వీరు వంటి చిత్రాల్లో నటించింది. 2009లో కన్నడలో అడుగుపెట్టింది. సంధ్య పాత్రలో మెప్పించి బెస్ట్ సపోర్టింగ్ రోల్ కింద ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుంది.

ఆ తర్వాత డాన్ శీను ఆఫర్ రాగా, మళ్లీ తెలుగు నాట అడుగుపెట్టింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కొట్టినా.. ఆమెకు మాత్రం అవకాశాలు రాలేదు. తిరిగి తన సొంత గూటికి చేరుకుంది. ఆర్జీవీ తెరకెక్కించిన డిపార్ట్ మెంట్ మూవీలో రానా భార్యగా నటిచింది అమ్మడు. నటిగా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. పంజాబీ, మరాఠీ భాషల్లో కూడా యాక్ట్ చేసింది. కాపీ విత్ ఢీ, అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్, ముంబయి సాగా, సాస్ బహు ఆచార్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్రాల్లో నటించింది. డాన్ శీను సమయంలో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రెట్టింపు అందంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తెలుగులో రెండంటే రెండు చిత్రాలతో మెరిసిన ఈ అందం.. త్వరలో టాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేయాలని కోరుకుందాం.

 

View this post on Instagram

 

A post shared by Anjana Sukhani (@anjanasukhani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet