iDreamPost
android-app
ios-app

ఫ్యామిలీ స్టార్ కు పోటీగా శ‌శివ‌ద‌నే

  • Published Feb 15, 2024 | 4:12 PM Updated Updated Feb 15, 2024 | 4:12 PM

ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టిస్తోన్న శ‌శివ‌ద‌నే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ చిత్రం విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ చిత్రానికి పోటీగా నిలువనుందా ..

ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టిస్తోన్న శ‌శివ‌ద‌నే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ చిత్రం విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ చిత్రానికి పోటీగా నిలువనుందా ..

  • Published Feb 15, 2024 | 4:12 PMUpdated Feb 15, 2024 | 4:12 PM
ఫ్యామిలీ స్టార్ కు పోటీగా శ‌శివ‌ద‌నే

‘పలాస 1978’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టిస్తోన్న శ‌శివ‌ద‌నే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఎమోషనల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌క్షిత్ అట్లూరి స‌ర‌స‌న కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాతో సాయి మోహన్ ఉబ్బన ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నారు. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్ వీ ఎస్ స్టూడియోస్ ప‌తాకాల‌ పై అహితేజ బెల్లంకొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న సాయంత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్ర నిర్మాతలు. ఏప్రిల్ 5, 2024న శ‌శివ‌ద‌నే విడుదల కానుంది. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా అయినా టాక్ బాగా వస్తే పెద్ద సినిమాలకు కాంపిటీషన్ లో ఎంత లేదన్నా ప్రభావం చూపుతుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ స్టార్ కు పోటీగా విడుదల అవుతున్న శ‌శివ‌ద‌నే ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది వేచి చూడాలి.

ఈ సినిమాలో రంగస్థలం మహేష్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ‌ర‌వ‌ణ‌ వాసుదేవ‌న్ పాటలు అందిస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఇచ్చే భాధ్యత అనుదీప్ దేవ్ తీసుకున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ మీద ఉన్న “మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే” డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమా ఎంటో ఈ డైలాగ్‌ తోనే చెప్పేశారు. స్వచ్చమైన గ్రామీణ ప్రేమ కథగా రానున్న శ‌శివ‌ద‌నే టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో 1 మిలియ‌న్‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. “గ‌డిచే కాలంలో ఈ నేల‌ పై న‌డిచే నా ప్ర‌తి అడుగు ఇక‌ పై నీతోనే” అంటూ సాగే టీజ‌ర్‌లోని డైలాగ్స్ సినిమా పై ప్రేకకకుల్లో ఆసక్తిని క‌లిగించాయి. ఈ సినిమాలోని శ‌శివ‌ద‌నే టైటిల్ సాంగ్‌తో పాటు డీజే పిల్లా పాట‌ల‌ను విడుదల చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet