iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దర్ని గుర్తుపట్టారా.. టాలీవుడ్‌లో ఫేమస్..

ఈ ఫోటోలోని ఇద్దర్ని చూశారా.. ఇందులో అమ్మాయి.. అందంగా ముస్తాబయ్యి.. ఓ అబ్బాయి వంక తదేకంగా చూస్తుంటే.. అతడు మాత్రం ఏమీ పట్టించుకోకుండా గలగల మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నాడు కదా.. ఇంతకు వాళ్లేవరో తెలుసా..?

ఈ ఫోటోలోని ఇద్దర్ని చూశారా.. ఇందులో అమ్మాయి.. అందంగా ముస్తాబయ్యి.. ఓ అబ్బాయి వంక తదేకంగా చూస్తుంటే.. అతడు మాత్రం ఏమీ పట్టించుకోకుండా గలగల మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నాడు కదా.. ఇంతకు వాళ్లేవరో తెలుసా..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దర్ని గుర్తుపట్టారా.. టాలీవుడ్‌లో  ఫేమస్..

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల కాలం. భోజనమైనా ఒక పూట మానేస్తారేమో కాని ఇంటర్నెట్, సోషల్ మీడియా లేకుండా జీవితాన్ని ఊహించుకోలేరు. పొద్దున్న నుండి అర్థరాత్రి వరకు ఈ జంగిల్‌లో బ్రతికేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక.. ఏ పిక్ ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. ముఖ్యంగా సినిమా నటీనటులకు సంబంధించిన ఫోటోలు ..ఆయా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. థ్రో బ్యాక్ ట్రెండ్ అంటూ .. అప్పుడు, ఇప్పుడు సాగే సాంగ్‌తో చిన్ననాటివి, ఇండస్ట్రీలోకి రాక ముందు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు సినీ సెలబ్రిటీలు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దర్ని చూశారు కదా. ఈ ఫోటో కూడా అలా బయటకు వచ్చిందే.

ఇంతకు అందులో ఉన్న వారిని గుర్తు పట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్. వీళ్లిద్దరూ అక్కా, తముళ్లు. తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు పిల్లలు వీళ్లు. ఈ ఇద్దరూ మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మి ప్రసన్న.. మరొకరు సొట్టబుగ్గల సుందరాంగుడు, తన టైమింగ్‌తో ఫన్ క్రియేట్ చేసే.. మంచు మనోజ్. ఈ పిక్ మంచు లక్ష్మి ప్రసన్న తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లక్ష్మి ప్రసన్నకు విష్ణు, మనోజ్ సోదరులు అన్న సంగతి విదితమే. మనోజ్ చిన్నవాడు కావడంతో లక్ష్మికి అతడంటే విపరీతమైన ఇష్టం. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇదే విషయాన్ని పలుమార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఈ మంచువారమ్మాయి.

ఇటీవల మనోజ్ రెండో వివాహం కూడా తన చేతుల మీద.. తన ఇంట్లో చేసింది లక్ష్మి. తాజాగా తన తమ్ముడితో దిగిన ఫోటోను షేర్ చేసింది.  ఇది లక్ష్మి ఓణీల ఫంక్షన్ నాటి ఫోటో అని తెలుస్తోంది. తమ్ముడి వంక లక్ష్మి తదేకంగా చూస్తుంటే.. మనోజ్ అక్కకు చెబుతున్నట్లు కనిపిస్తోంది ఈ స్టిల్. ఇక మంచు మనోజ్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలకు వస్తే.. ఇటీవల భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న మంచు వారబ్బాయి.. త్వరలో తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఓ గేమ్ షోతో అలరిస్తూనే ఉన్నాడు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం సాగిపోతున్న షోలో తనదైన స్పాంటినిటీతో నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడు. అలాగే ఈ జంట పిల్లల టాయ్స్ కు సంబంధించి నమస్తే వరల్డ్ పేరుతో కొత్త బిజినెస్ స్టార్ చేశారు. అలాగే మంచు లక్ష్మి ప్రసన్న కూడా అగ్ని నక్షత్రం మూవీతో రాబోతున్నారు.మరీ ఈ పిక్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి