iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఇప్పుడో స్టార్ హీరోయిన్..

  • Published Jan 08, 2024 | 8:02 PM Updated Updated Jan 08, 2024 | 8:02 PM

తల్లి పాత్రలు చేయడానికైనా సిద్ధమే కానీ.. ఏవీ పడితే ఆ సినిమాలు చేయను అని ఓ యంగ్ హీరోయిన్ చెబితే.. సినిమా పట్ల ఆ నటికి ఉన్న ప్యాషన్ ఎలాంటిది తెలుస్తుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిది కూడా అదే నైజం. ఇంతకు ఆ నటి ఎవరో గుర్తుపట్టారా..?

తల్లి పాత్రలు చేయడానికైనా సిద్ధమే కానీ.. ఏవీ పడితే ఆ సినిమాలు చేయను అని ఓ యంగ్ హీరోయిన్ చెబితే.. సినిమా పట్ల ఆ నటికి ఉన్న ప్యాషన్ ఎలాంటిది తెలుస్తుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిది కూడా అదే నైజం. ఇంతకు ఆ నటి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jan 08, 2024 | 8:02 PMUpdated Jan 08, 2024 | 8:02 PM
ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఇప్పుడో స్టార్ హీరోయిన్..

కొంత మంది హీరోయిన్లు సినిమాపై ఫ్యాషన్‌తో వస్తుంటారు. అయితే ఆఫర్లు వచ్చేశాయి కదా అని ఏడా పెడా సినిమాలు చేయరు.. ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. కథ నచ్చి, తన పాత్రకు తగ్గ ప్రాధాన్యత లభిస్తేనే చిత్రాలకు సైన్ చేస్తుంటారు. అలా అనీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తామని పట్టుబట్టడం లేదు. పాత్ర పరిధి మేర కాకుండా.. ప్రేక్షకుల మదిలో నిలిచి పోవాలన్న ఆకాంక్షతో చూసీగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. ఖాళీగా ఉండటానికైనా ఇష్టపడతారు కానీ.. బోర్డర్స్ క్రాస్ చేసేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపరు. ఆఫర్లు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆత్మ విశ్వాసాన్ని, తమ ఆత్మ గౌరవాన్ని చంపుకుని సినిమాలు చేయడం లేదు కొంత మంది నటీమణులు. అలాంటి హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. ఇదిగో ఆ కోవకే వస్తుంది ఈ ఫోటోలో చిన్నారి కూడా.

సంప్రదాయక దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాపను గుర్తు పట్టారా.. తెలుగులో తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచేసింది. ఫస్ట్ మూవీలో ఎవ్వరూ తల్లి పాత్రను పోషించేందుకు ఇష్టపడరు. కానీ తను అలా కాదూ.  కథ, క్యారెక్టర్ నచ్చడంతో తల్లి రోల్‌లో నటించింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తు పట్టారా.. ఇప్పుడు ఈ సంక్రాంతికి అలరించేందుకు వస్తుంది ఈ అమ్మడు. ఆమె మరెవ్వరో కాదూ.. శ్రద్ధా శ్రీనాథ్. సంక్రాంతికి సైంధవ్ మూవీతో రాబోతుంది. జనవరి 13న ఈ మూవీ ధియేటర్లతో విడుదల కానుంది. దక్షిణాదిలో అన్ని భాషలతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది ఈ భామ. జమ్ము కాశ్మీర్‌లో పుట్టిన ఈ యాపిల్ పండు తొలుత మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కోహినూర్ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. అనతి కాలంలో అన్ని భాషల్లోనూ యాక్ట్ చేసింది.

2016లో కన్నడలో యూటర్న్ అనే మూవీ చేయగా.. అక్కడ హిట్ కొట్టింది. ఆ తర్వాత తమిళ్, అటు నుండి హిందీ, ఆ తర్వాత తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జెర్సీ మూవీలో నాని భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా కనిపించింది. ఆ తర్వాత జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీలా చేసింది. తమిళ్, మలయాళ కన్నడ సినిమాలు చేసింది.ఇటీవల విక్రమ్ ప్రభుతో ఇరుగ పొట్రు అనే మూవీలో నటించగా..ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఇప్పుడు మూడేళ్ల గ్యాప్ తర్వాత.. సైంధవ్ మూవీతో పలకరిస్తోంది అమ్మడు. తనకు నచ్చితేనే సినిమాలు చేస్తున్న ఈ భామ.. వరుసగా మూడు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ.. తన పని చేసుకుంటూ పోతుంది. మరీ శ్రద్ధా నటించిన చిత్రాల్లో మీకు ఏదీ ఇష్టమో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş