iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని హీరోని గుర్తుపట్టారా.. ఇంతలా మారిపోయాడేంటీ..?

  • Published Dec 21, 2023 | 5:16 PM Updated Updated Dec 21, 2023 | 5:23 PM

సినిమా అనేది ఓ మాయా ప్రపంచం. అందులోకి వెళ్లిన వాళ్లు .. త్వరగా ఆ మాయలో నుండి బయటపడలేరు. సినిమా కోసం ఏమైనా చేసేవాళ్లున్నారు. ఇక నటులుగా రాణించేందుకు తమను తాము మేకోవర్ చేసుకుంటుంటారు నటీనటులు.. ఇదిగో ఈ ఫోటోలోని హీరోను గుర్తుపట్టారా..?

సినిమా అనేది ఓ మాయా ప్రపంచం. అందులోకి వెళ్లిన వాళ్లు .. త్వరగా ఆ మాయలో నుండి బయటపడలేరు. సినిమా కోసం ఏమైనా చేసేవాళ్లున్నారు. ఇక నటులుగా రాణించేందుకు తమను తాము మేకోవర్ చేసుకుంటుంటారు నటీనటులు.. ఇదిగో ఈ ఫోటోలోని హీరోను గుర్తుపట్టారా..?

  • Published Dec 21, 2023 | 5:16 PMUpdated Dec 21, 2023 | 5:23 PM
ఈ ఫోటోలోని హీరోని గుర్తుపట్టారా.. ఇంతలా మారిపోయాడేంటీ..?

సినిమా కోసం హీరోలు కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. కొత్తగా మేకోవర్ అవుతుంటారు. సినిమా కోసం కొన్నింటిని వదులుకుంటారు. త్యాగాలు చేస్తుంటారు. మూవీస్ పట్ల ఉన్న ఫ్యాషన్‌తో కథకు తగ్గట్టుగా, దర్శకుడు మారమన్నట్లుగా గెటప్ చేంజ్ చేస్తారు. సినిమా షూటింగ్‌కు ముందే ఈ కసరత్తులు ప్రారంభిస్తారు. డైట్ ఫాలో అవుతుంటారు. నచ్చినది తినలేరు, సిక్స్ ప్యాక్, కండలు పెంచేందుకు ఎప్పుడూ జిమ్ లో గడుపుతూ ఉంటారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న నటుడ్ని గుర్తుపట్టారా? గబుక్కున అల్లు అర్జున్ పుష్ప గెటప్ అనుకునేరు కానే కాదూ. సరిగ్గా చూస్తే.. ఇట్టే అర్ధమౌతుంది. అక్కినేని వారసుడు నాగ చైతన్య అని.

తాత, తండ్రి నుండి నటనా వారసత్వాన్నిపుణికి పుచ్చుకున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. జోష్‌తో మొదలైన అతడి సినిమా కెరీర్.. ఎత్తు పల్లాలుగా నడుస్తూ ఉంది. నిన్న మొన్న వచ్చిన హీరోలు సైతం పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తుంటే.. ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు అతడూ కూడా దూత వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా రేసులోకి వచ్చేశాడు. ఇక సినిమా పరంగా కార్తీక్ మెండేటీతో తండేల్ మూవీతో పాన్ ఇండియా చిత్రాన్ని షురూ చేశాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఉత్తరాంధ్రలోని మత్య్సకారులకు సంబంధించిన చిత్రంగా తెలుస్తోంది. ఇందులో మత్య్సకారుడి పాత్రలో చైతు కనిపించనున్నట్లు తెలుస్తోంది. మాస్ లుక్స్‌లో పోస్టర్లలో దర్శనమిచ్చాడు. ఇప్పటి వరకు హ్యాండ్సమ్ గాయ్‌గా కనిపించిన చై.. లుక్స్‌లో మేకోవర్ కనిపిస్తోంది. గుబురుగా పెంచిన గడ్డం, తల, కండలతో తొలి పోస్టర్‌లో కనిపించాడు చై. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది. అప్పుడే ఓ ఫోటో లీక్ అయ్యి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అచ్చమైన మాస్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు నాగ చైతన్య. బాగా పెంచిన గడ్డం, సాదా సీదా షర్ట్, నుదిటిన తిలకం, గుబురుగా పెంచిన గడ్డం చూస్తుంటే.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో ఈ గెటప్ చూస్తే అర్థం అవుతుంది.

ప్రస్తుతం ఈ పిక్స్ చూస్తుంటే.. అతడి ఖాతాలో హిట్ ఖాయమనిపిస్తోంది. కొన్ని యదార్థ గాధల ఆధారంగా తండేల్ మూవీ తెరకెక్కుతున్నట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. జీవనం కోసం సముద్రంలోకి వెళ్లి.. అనుకోకుండా పరాయి దేశ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయి..ఆ దేశానికి బందీగా మారిన ఓ భర్త చేసే పోరాటం.. భర్త కోసం నిండు చూలాలైన భార్య పడే ఆరాటాన్ని చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. కొంత టాకీతో పాటు యాక్షన్ పార్ట్ కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. లవ్ స్టోరీ జంట మరో సారి హిట్ అందుకోనుందని భావిస్తే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş