iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో అమ్మాయిని గుర్తు పట్టారా.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

  • Published Feb 14, 2024 | 3:16 PM Updated Updated Feb 14, 2024 | 3:16 PM

ఈ ఫోటోలో అమ్మాయిని చూశారా.. ఏదో ప్రైడ్ మూమెంట్ అనుకుంటా చాలా సంబరపడిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ ఆమె. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

ఈ ఫోటోలో అమ్మాయిని చూశారా.. ఏదో ప్రైడ్ మూమెంట్ అనుకుంటా చాలా సంబరపడిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ ఆమె. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

  • Published Feb 14, 2024 | 3:16 PMUpdated Feb 14, 2024 | 3:16 PM
ఈ ఫోటోలో అమ్మాయిని గుర్తు పట్టారా.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

ఇప్పుడు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తోంది. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ చేసి.. తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు కొంత మంది నటీమణులు. ఒక్క సినిమాతో ఫేమస్ అయిపోతున్నారు. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోల పక్కన లేదా బడా నిర్మాణ సంస్థలో ఛాన్సులు పొందుతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి, వైష్ణవి చైతన్య, శోభిత దూళిపాళ్ల లాంటి అమ్మాయిలు మెల్లిగా వచ్చి.. ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో భామ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. నిన్న మొన్నటి వరకు చాలా సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు. కానీ ఆ చిత్రంతో బడా నిర్మాణ సంస్థలో హీరోయిన్‪గా ఛాన్సు కొట్టేసినట్లు వార్త వినిపిస్తోంది.

ఇంతకు ఆ ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..? అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీగా నిలవనుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అన్న వార్తలకు చెక్ పెట్టే పనిలో పడింది. స్కోప్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. ట్రూలవర్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిన బ్యూటీ శ్రీ గౌరి ప్రియ. పదాహారణాల తెలుగు అమ్మాయి అయిన శ్రీ గౌరి.. టాలీవుడ్‌లో 2016లోనే ఎంట్రీ ఇచ్చింది. గుర్తింపు లేని పాత్రలు చేసింది. 2018లో మిస్ హైదరాబాద్ పోటీల్లో విజేతగా నిలిచింది. 2020లో ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత అశ్వినిదత్ కుమార్తె స్వప్నదత్ తెరకెక్కిస్తున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అదే కంబాల పల్లి కథలు.. మెయిల్. ఈ మూవీ 2021లో ఆహాలో విడుదలైంది. డీ గ్లామరైజ్డ్ రోల్ లో మెప్పించింది. ఆ తర్వాత లవ్ స్టోరీ, శ్రీకారం చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసింది.

కాగా, సుహాస్ రైటర్ పద్మ భూషణ్ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా ఛాన్సు కొట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. టాలీవుడ్ నుండి కోలీవుడ్ బాట పట్టింది గౌరి ప్రియ. తమిళ్ వెబ్ సిరీస్ మోడ్రన్ చెన్నైలో అవకాశం రావడంతో తనను తాను ఫ్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో మ్యాడ్ మూవీలో రామ్ నితిన్ పెయిర్ శృతిగా మెస్మరైజ్ చేసింది. కానీ ఒక్కసారిగా ఆమె పేరు చర్చించుకునేలా చేసిన చిత్రం లవర్. తమిళంలో గుడ్ నైట్ మూవీతో పేరు తెచ్చుకున్న మణికందన్ ఇందులో కథానాయకుడు. ఈ సినిమాను తెలుగులో ట్రూలవర్ పేరుతో తీసుకువచ్చారు నిర్మాతలు మారుతి, ఎస్కేఎన్. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో శ్రీ గౌరి ప్రియ పేరు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కాగా, మైత్రి మూవీ తెరకెక్కించబోతున్న 8 వసంతాల్లో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. అఫిషియల్ ఎనౌన్స్ అయితే రాలేదు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş