iDreamPost
android-app
ios-app

Pic Talk: రంగస్థలం మూవీలో ఆది ప్రేయసి గుర్తుందా ! ఇంతలా మారిపోయిందేంటీ!

  • Published Jun 02, 2024 | 4:07 PM Updated Updated Jun 02, 2024 | 4:07 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ ఏంటో అందరికి తెలిసిందే. అదే సెలెబ్రిటీల అప్పడు ఇప్పుడు ఫొటోస్.. ఈ క్రమంలో ఇప్పుడు మరొక హీరోయిన్ ఫోటో ఈ లిస్ట్ లోకి యాడ్ అయిపొయింది, మరీ ఈ ముద్దుగుమ్మ ఎవరో చూసేద్దాం.

ఈ మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ ఏంటో అందరికి తెలిసిందే. అదే సెలెబ్రిటీల అప్పడు ఇప్పుడు ఫొటోస్.. ఈ క్రమంలో ఇప్పుడు మరొక హీరోయిన్ ఫోటో ఈ లిస్ట్ లోకి యాడ్ అయిపొయింది, మరీ ఈ ముద్దుగుమ్మ ఎవరో చూసేద్దాం.

  • Published Jun 02, 2024 | 4:07 PMUpdated Jun 02, 2024 | 4:07 PM
Pic Talk: రంగస్థలం మూవీలో ఆది ప్రేయసి గుర్తుందా ! ఇంతలా మారిపోయిందేంటీ!

సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ స్టార్ట్ అయిందంటే .. దానికి అసలు బ్రేక్ ఏ ఉండదు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ సెలెబ్రిటీల అప్పుడు ఇప్పుడు ఫొటోస్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్న సెలెబ్రిటీలు చిన్నపుడు ఎలా ఉన్నారు. లేదా చిన్న వయసులోనే అందరికి పరిచయం అయినా తారలు ఇప్పుడు ఎం చేస్తున్నారు ఎలా ఉన్నారు లేదా కొన్ని సినిమాలలో ఎంతో పద్దతిగా కనిపించిన వారు బయట ఎలా ఉంటున్నారు, ఇలా రకరకాలుగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ క్రమంలో ఈ లిస్ట్ లోకి మరో అమ్మడి ఫోటో యాడ్ అయిపొయింది. మరి ఈ అమ్మడు ఎవరో అప్పడు ఎలా ఉందొ .. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసేద్దాం.

2018 లో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పి తీరాలి. విమర్శకుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందిపుచ్చుకున్న సినిమా ఇది. 1980ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వై రవి శంకర్, సివి మోహన్ నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాకు చెప్పుకోబోయే హీరోయిన్ కి సంబంధం ఏంటంటే .. ఈ సినిమాలో రామ్ చరణ్ కు అన్నయ్యగా ఆది పినిశెట్టి నటించిన సంగతి తెలిసిందే. అదే సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయసిగా ఓ అమ్మాయి కనిపించింది గుర్తుందా.. ఈ అమ్మడు స్క్రీన్ మీదకి కనిపించిన టైమ్ తక్కువే అయినా కూడా.. ఈమె ప్రేమ కథ వలెనే ఆ సినిమా కథ మలుపు తిరుగుతుంది. ఆ కథేంటో అందరికి తెలిసిందే కాబట్టి ఈ అమ్మడి విషయానికొచ్చేద్దాం.

రంగస్థలం సినిమా హిట్ అవ్వడంతో.. ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చాయి. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, బ్రాండ్ బాబు, సెవెన్ వంటి పలు సినిమాలలో నటించింది ఈ అమ్మడు. ఈమె తెలుగు అమ్మాయి కాదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అమ్మడు పక్కా తెలుగు అమ్మాయి. ఈమె విశాఖపట్నంకు చెందిన పూజిత. ఆమె తన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ళు టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేసింది. 2016 లో తుంటరి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో.. కొన్నాళ్ళు తమిళంలో కూడా నటించింది ఈ అమ్మడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గానే ఉంటుంది. ఆ సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా మారిపోవడం చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మరి ఈ అమ్మడి లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss