iDreamPost
android-app
ios-app

శోభిత ధూళిపాళ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

  • Published Aug 10, 2024 | 4:41 PM Updated Updated Aug 10, 2024 | 4:41 PM

అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళలకు తాజాగా నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకల జరిగిన నుంచి నెట్టింట శోభిత ధూళిపాళ గురించి చాలామంది నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా శోభితలో కలిసివున్న ఈ అమ్మాయి ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా..

అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళలకు తాజాగా నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకల జరిగిన నుంచి నెట్టింట శోభిత ధూళిపాళ గురించి చాలామంది నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా శోభితలో కలిసివున్న ఈ అమ్మాయి ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా..

  • Published Aug 10, 2024 | 4:41 PMUpdated Aug 10, 2024 | 4:41 PM
శోభిత ధూళిపాళ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

తాజాగా టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళలకు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకలనేవి గురువారం ఉదయం ఇరు కుటుంబ సభ్యులు సమక్షంలో ఘనంగా జరిగాయి. అయితే ఈ నిశ్చితార్ధ వేడుకలకు సంబంధించి ఫోటోలను కూడా కింగ్ నాగర్జున స్వయంగా తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక అప్పటి నుంచి నెట్టింట శోభిత, చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత కోసం నెటిజన్స్, ఫ్యాన్స్
ఇంటర్ నెట్ లో తెగ సెర్చింగ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే.. ఆమె సినీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు.

ఇందులో భాగంగానే.. శోభితకు సంబంధించిన నిశ్చితార్ధం ఫోటోస్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు తాజాగా శోభితతో కలిసివున్న ఓ అందమైన అమ్మాయి ఫోటో కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.  ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ఆమె మరెవరో కాదు.. శోభిత చెల్లెలు ‘సమంత ధూళిపాళ’. ప్రస్తుతం ఈ పేరుతో పాటు శోభితతో ఉన్న తన చెల్లెలు సమంత ఫోటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో సమంత, శోభితకు చెల్లెలు కావడమేంటి ఏలా అంటూ.. తెగ సెర్చ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే శోభితకు సంబంధించిన పూర్తి బయోడేటాను వెలికితీస్తున్నారు. అయితే చూడటానికి మోడ్రన్ గా ఫారిన్ అమ్మాయిలా కనిపించిన ఈ ముద్దుగమ్మ.. అచ్చమైన తెలుగమ్మాయి. శోభిత ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో 1992, మే 31న జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాల్ రావు విశాఖపట్నంలో నేవీ ఇంజనీర్‌గా పని చేసేవారు. తల్లి.. శాంతా కామాక్షి స్కూల్‌ టీచర్‌. దీంతో శోభిత బాల్యం మొత్తం వైజాగ్ గడిచింది.

ఇక చదువుల నిమిత్తం ముంబైకి వెళ్లి అక్కడే లా కోర్స్ లో చేరింది. ఇకపోతే చదువుల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేది. ఈ క్రమంలోనే శోభిత భరతనాట్యం,కూచిపూడి వంటి వాటిలో కూడా శోభిత శిక్షణ పొందిన మంచి నృత్యకారిణి. అంతేకాకుండా.. మోడలింగ్ మీద ఇష్టంతో 2010లో నేవీ నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొనడమే కాక.. నేవీ క్వీన్‌గా కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ముందుగా 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మొదట బాలీవుడ్ లోని అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అక్కడే పలు సినిమాల్లో అలరించిన శోభిత ఆ తర్వాత టాలీవుడ్ లో అడవిశేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇలా ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తునే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇకపోతే శోభిత చివరిగా మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటించింది. ఇక విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం నాగ చైతన్యకు కాబోయే భార్య, అక్కినేని ఇంటికి కోడలు కావడంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన శోభిత ధూళిపాళ పేరు మారు మోగుతునే ఉంది. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. కాకపోతే వీరి పెళ్లికి సంబంధించిన ఆఫిషియల్ డేట్ ను ఇంక అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే వీరి వెడ్డింగ్ కు సంబంధించిన వివరాలు కూడా ప్రకటిస్తరాని సమాచారం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişanadolucasino girişgrandpashabet