Keerthi
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మలు తీసుకున్న పారితోషికం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఎవరెవరు ఎంత అందుకుంటున్నారంటే..
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మలు తీసుకున్న పారితోషికం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఎవరెవరు ఎంత అందుకుంటున్నారంటే..
Keerthi
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవ ఉండదు. తరుచు ఎంతో మంది సినీ తారలు వస్తూ పోతూ ఉంటారు. కానీ, కొంతమంది మాత్రమే స్టార్ హోదాను దక్కించుకుంటారు. అయితే ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండలంటే చిన్న మాట కాదు. ఈ క్రమంలోనే.. తెలుగు చిత్రపరిశ్రమలో పట్టుమని చూస్తే అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వారు ఒక్కోక్క సినిమాకు తీసుకొనే రెమ్యునరేషన్స్ మాత్రం భారీగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మన తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ తారలకు ఏమాత్రం తీసిపోరు. మరి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాముద్దుగుమ్మలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ‘అనుష్క శెట్టి’. ఈమె ప్రస్తుతం ఒక్కోక్క సినిమాకి రూ. 4కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుంది. కాగా, అనుష్క ఇటీవలే ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. ఈమె తర్వాత ఆ స్థాయిలో తీసుకుంటున్న హీరోయిన్ ‘రష్మిక మందన’. ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుత పారితోషికం రూ.4కోట్లు ఉంటుంది. కానీ, ‘పుష్ప2’ సక్సెస్ అయితే ఈమె రేంజ్ మారిపోతుంది. అప్పుడు రెమ్యునరేషన్ పెంచెసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
తర్వాత స్థాయిలో భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న నటి ‘సమంత’. ప్రస్తుతం ఈమె రూ.3కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇక సమంత ఇటీవలే ‘ఖుషి’ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత స్థాయిలో ‘పూజ హెగ్డే’ ఉన్నారు. ప్రస్తుతం ఈమె రూ.3 నుంచి రూ.4కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటుంది. అయితే మొన్నటి వరకు వరస విజయాలతో దూసుకోపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు జోరు తగ్గడంతో రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక ఈమె తర్వాత కోలీవుడ్ నటి ‘కీర్తి సురేష్’ లైన్ లో ఉన్నారు. ఈమె ప్రస్తుత పారితోషికం రూ. 2 కోట్లు తీసుకుంటుంది. ఈమె ‘భోళా శంకర్’ సినిమా తర్వాత ఇక ఏ సినిమాలో నటించ లేదు. ఈమె తర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ ‘కాజల్ ఆగర్వల్’. ఈమె ‘భగవంత్ కేసరి’ గురించి రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం అందుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’లో నటిస్తోంది. అలాగే మిల్కీ బ్యూటీ ‘తమన్నా’. ఈమె ఒక్కోక్క సినిమాకు దాదాపు రూ. కోటి వరకు అందుకోంటోంది. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఇక నేచరల్ బ్యూటీ ‘సాయి పల్లవి’ సైతం ఒక్కోక్క సినిమాకి రూ .3కోట్లు తీసుకుంటుంది. ప్రస్తుతం ఈమె నాగచైతన్య సరసన ‘తండేల్’ సినిమాలో నటిస్తుంది.
అలాగే బాలీవుడ్ అందలా భామ ‘కియారా ఆద్వానీ’. ఈమె కూడా ఒక్కో సినిమాకి రూ. 3కోట్లు తీసుకుంటుంది. ఇక ఈమె రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’ కు కూడా రూ.3కోట్లు అందుకుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ ఉంది. రకుల్ కు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఆవకాశాలు తగ్గాయి. ఈమె ఒక్కోక్క సినిమాకి రూ. 70లక్షలు తీసుకుంటుంది. మరి, టాలీవుడ్ లో మన స్టార్ హీరోయిన్లు ఒక్కోక్కరు అందుకుంటున్న రెమ్యునరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.