iDreamPost
android-app
ios-app

ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు.. చిరంజీవికి చెల్లిగా, హీరోయిన్ గా చేశారు! ఎవరో తెలుసా?

  • Author ajaykrishna Published - 03:01 PM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 03:01 PM, Tue - 8 August 23
ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు.. చిరంజీవికి చెల్లిగా, హీరోయిన్ గా చేశారు! ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలు లేదా హీరోయిన్స్ ఒకే సినిమాలో కలిసి నటించడం చూస్తుంటాం. ఇలాంటి కాంబినేషన్స్ అరుదుగా జరుగుతుంటాయి. అయితే.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంతటి స్టార్డమ్ చూసినా.. ఒక దశలో పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. కొందరు చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత హీరోయిన్ గా కాకుండా వేరే క్యారెక్టర్స్ లో సినిమాలు చేస్తుంటారు. లేదా పూర్తిగా సినిమాలకు బ్రేక్ చెప్పేసి ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తారు. అలా హీరోయిన్ గా ఓ దశలో వెలుగువెలిగి.. ఆ తర్వాత తమ వారసులు, వారసురాళ్లను ఇండస్ట్రీలో పరిచయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అలా ఒకప్పుడు హీరోయిన్ గా మెగాస్టార్ సరసన నటించిన ఓ బ్యూటీ.. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకొని.. కొన్నాళ్ళకు కూతురిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రస్తుతం ఆ కూతురు స్టార్ హీరోయిన్ గా తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో వెలుగుతోంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ ఒక్కో స్టెప్ ఎదుగుతోంది. కట్ చేస్తే.. మెగాస్టార్ సినిమాలో అవకాశం అందుకుంది. కానీ.. హీరోయిన్ గా కాదు. చెల్లిగా నటించింది. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇంతకీ ఏ సినిమా గురించి చెప్తున్నానో అర్థమైంది కదా! మెగాస్టార్ భోళాశంకర్ మూవీ గురించి.

ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న ఈ భామ.. చిరుకి చెల్లిగా నటించి అందరిని సర్ప్రైజ్ చేసింది. అసలు విషయంలోకి వస్తే.. కీర్తిసురేష్ తల్లి కూడా ఒకప్పటి హీరోయిన్ అని ఎంతమందికి తెలుసు. ఆమె పేరు మేనక. 1980లో మెగాస్టార్ సరసన పున్నమినాగు అనే సినిమాలో నటించి.. మంచి హిట్ అందుకుంది మేనక. ఆ సినిమాలో చిరు, మేనక పెయిర్ కి మంచి పేరొచ్చింది. అయితే.. దాదాపు నలభై రెండేళ్ల తర్వాత మేనక కూతురు కీర్తి.. చిరుకి చెల్లిగా నటించడం విశేషం. అలా తల్లికూతుళ్లు చిరుకి హీరోయిన్ గా, చెల్లిగా నటించారు. ఇదిలా ఉండగా.. భోళా శంకర్ మూవీ ఆగష్టు 11న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఇది అజిత్ వేదాలంకి రీమేక్. మరి భోళా శంకర్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.