iDreamPost
android-app
ios-app

జయం సినిమాలోని సదా చెల్లెలు ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • Published Dec 29, 2023 | 7:27 PM Updated Updated Dec 30, 2023 | 5:59 PM

Jayam Movie Child Artist Now.. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రాల్లో జయం మూవీ ఒకటి. 2002లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్. చిన్న సినిమాగా విడుదలై.. ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ ద్వారానే నితిన్, సదా హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో..

Jayam Movie Child Artist Now.. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రాల్లో జయం మూవీ ఒకటి. 2002లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్. చిన్న సినిమాగా విడుదలై.. ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ ద్వారానే నితిన్, సదా హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో..

  • Published Dec 29, 2023 | 7:27 PMUpdated Dec 30, 2023 | 5:59 PM
జయం సినిమాలోని సదా చెల్లెలు ఇప్పుడెలా ఉందో తెలుసా..?

ప్రేమ కథలకు విలేజ్, కాలేజీ బ్యాక్ డ్రాప్ అందించి.. సినిమా తీయడంలో దిట్ట దర్శకుడు తేజ. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు అందించడంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా మారాడు. నూనుగు మీసాలు ఉండే కుర్రాళ్లను హీరోలుగా పెట్టి.. కొత్త భామలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. హీరోను పిరికిగా చూపిస్తూనే.. హీరోయిన్‌కు అందంతో పాటు గడుసు అమ్మాయిగా చూపిస్తుంటారు. ఇంచు మించు ఇప్పటి వరకు 20 సినిమాలు తీయగా.. ఆయన తెరకెక్కించిన ప్రేమ కథల్లో హీరో హీరోయిన్లను ఇలా పోట్రేట్ చేస్తుంటారు. చిత్రం, నువ్వు నేను, జయం, నిజం, జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా, లక్ష్మి కళ్యాణం, మొన్న వచ్చిన అహింసా వరకు చిత్రాలన్నీ యూత్ ఫుల్ లవ్ స్టోరీస్సే.

అయితే వీటిలో ఆయనకు బాగా పేరు తెచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ఒకటి జయం. ఈ సినిమా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది సదా ‘వెళ్లవయ్యా వెళ్లు’ డైలాగే. ఈ మూవీతోనే హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు నితిన్, సదా. 2002లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్. పాటలు ఇప్పటికీ మంచి ఫీల్ అందిస్తుంటాయి. గోపిచంద్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రంతో సదా క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఇందులో సదా చెల్లెలి పాత్రలో కనిపించిన పాప గుర్తుందా.. ఆ సినిమాలో అక్క సదాను టీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే అక్షరాలను రివర్స్‌లో రాస్తూ ఫేమస్ అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? పెళ్లి చేసుకుని.. ఓ పాపకు తల్లి కూడా అయ్యింది. ఆ అమ్మాయి పేరు యామిని శ్వేత.

jayam movie yamini swetha

యామిని శ్వేత ఎవరో కాదూ.. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కుమార్తె. జయలక్ష్మి బొమ్మరిల్లుతో పాటు అనేక సినిమాల్లో నటించింది. శ్వేతకు జయం మూవీకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా వచ్చింది. అప్పుడప్పుడు అనే మూవీలో కూడా కనిపిస్తుంది. అడపాదడపా సినిమాల్లో నటించిన ఈ చిన్నారి..పలు యాడ్స్‌లో యాక్ట్ చేసింది. పెద్దయ్యాక సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి చేసుకుని.. విదేశాల్లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జయ లక్ష్మి షేర్ చేస్తున్న వీడియోల్లో ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఆమె కూతురు, మనవరాలితో(శ్వేత కూతురు) వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఉంటారు జయలక్ష్మి. ప్రస్తుతం ఈ అమ్మాయిని చూస్తే..పెళ్లైందంటే అస్సలు నమ్మరు. మరీ మీకెమనిపించిందో అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Actress Jayalakshmi (@actressjayalakshmi)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş