iDreamPost
android-app
ios-app

Photriya Venky: సత్యం సినిమాలో నటించిన ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

  • Published Aug 13, 2024 | 12:20 AM Updated Updated Aug 13, 2024 | 12:20 AM

Photriya Venky: సుమంత్, జెనీలియా నటించిన సత్యం సినిమాలో.. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించిన ఈ యువకుడు ఇప్పుడు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో తెలుసా?

Photriya Venky: సుమంత్, జెనీలియా నటించిన సత్యం సినిమాలో.. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించిన ఈ యువకుడు ఇప్పుడు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో తెలుసా?

  • Published Aug 13, 2024 | 12:20 AMUpdated Aug 13, 2024 | 12:20 AM
Photriya Venky: సత్యం సినిమాలో నటించిన ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారిని, యుక్త వయసులో ఉన్నప్పుడు నటించిన వారిని కొన్నేళ్ల తర్వాత చూస్తే అస్సలు గుర్తుపట్టలేని పరిస్థితి. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్నవాళ్లు ఇప్పుడు హీరోల్లా ఉంటారు. బక్కపలచగా ఉన్నవాళ్లు కూడా హీరో ఫిజిక్ తో అదరగొడుతుంటారు. ఈ కుర్రాడు కూడా అంతే. ఒకప్పుడు కమెడియన్ గా కనిపించిన ఈ యువకుడు ఇప్పుడు హీరోలా ఉన్నారు. బక్కపలచగా అలరించిన ఈ యువకుడు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే షాక్ అయిపోతారు. సుమంత్ నటించిన సత్యం సినిమాలో కమెడియన్ గా, సుమంత్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరిగా వెంకట్ నటించారు. సత్యం రాజేష్ తో కలిసి వెంకట్ చేసే కామెడీ సూపర్బ్ ఉంటుంది. ఒక తాడు తీసుకెళ్లడానికి రెండు వాహనాలు అవసరమా? అని.. బస్టాప్ లో సత్యం రాజేష్ ని కొట్టించే సీన్ గానీ కడుపుబ్బా నవ్విస్తాయి.

ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో శర్వానంద్, మెగా హీరో వైష్ణవ్ తేజ్ లు నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరివి గుర్తుండిపోయే పాత్రలే. అలానే ఈ యువకుడిది కూడా. ఈ మూవీలో శంకర్ క్లాస్ మేట్ గా నటించిన ఈ కుర్రాడి పేరు వెంకట్ పాలూరి. ఈయన స్వగ్రామం కరీంనగర్. ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి జేఎన్టీయూ కాలేజీలో ఫోటోగ్రఫీ కోర్సులో చేరారు. ఫోటోగ్రఫీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక స్టూడియో స్టార్ట్ చేశారు. కృష్ణానగర్ లోని మంగ టిఫిన్ సెంటర్ దగ్గరకి వచ్చే సినిమా వాళ్ళకి ఫోటోలు తీసేవారు. ఆ ఫోటోలు ఫిల్మ్ ఆఫీసులకు వెళ్ళేవి. అక్కడ ఫిల్మ్ డైరెక్టర్స్, నిర్మాతలు ఫోటోలు ఎవరు తీశారు అని తెలుసుకుని వెంకట్ కి కబురు పంపించారు.

లా సినిమాలకు సంబంధించి అప్ కమింగ్ హీరో, హీరోయిన్ల ఫోటోలు తీసేవారు. కొత్త హీరోలకు, కొత్త హీరోయిన్లకు లుక్ టెస్ట్ చేసేవారు. అలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ గా ఎదిగారు. అలా ఫోటోగ్రాఫర్ గా చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన ఫోటోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. ఫోట్రియా వెంకీ పేరుతో వెడ్డింగ్ ఫోటో షూట్ లు చేస్తున్నారు. 23 ఏళ్ల నుంచి ఫోటోగ్రాఫర్ గా ఉన్నారు. 3500కి పైగా వెడ్డింగ్ ఫోటోషూట్స్ చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, సిద్ధార్థ్, నాని, నవదీప్ వంటి హీరోలకి.. కాజల్, సమంత, నయనతార, రష్మిక వంటి హీరోయిన్స్ కి ఫోటోషూట్స్ కూడా చేశారు. రీసెంట్ గా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను చిరంజీవి వీరాభిమానినని.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా కోసం 22 రోజులు షూట్ లో పాల్గొన్నా అని అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనుకోవడానికి చిరంజీవి కారణమని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.   

 

View this post on Instagram

 

A post shared by Photriya Studios (@photriyavenky)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş