Swetha
ప్రస్తుతం ఓటీటీ హావ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే.. ఓటీటీ సంస్థలు ఆ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న డీజే టిల్లు స్క్వెర్ చిత్రం ఓటీటీ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ఓటీటీ హావ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే.. ఓటీటీ సంస్థలు ఆ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న డీజే టిల్లు స్క్వెర్ చిత్రం ఓటీటీ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజ చిత్రం “డీజే టిల్లు స్క్వేర్”. ఈ చిత్రం థియేటర్ లో విడుదల కావడానికి దాదాపు ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ, అప్పుడే ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు .. ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ తో.. ఈ సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనితో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ముందుగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ డిజిటల్ రైట్స్ ఏ ప్లాట్ ఫార్మ్ దక్కించుకొంది అనే.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “డీజే టిల్లు స్క్వేర్”. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ తో .. యూత్ కు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా వర్డ్ వైస్ గా మార్చి 29న విడుదల చేయనున్నట్లు ప్రకటిచారు మేకర్స్. ఈ క్రమంలో విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగా.. ఈలోపే ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడు పోయాయట. కాగా, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సోనీలివ్ లాంటి ప్రముఖ సంస్థలు పోటీ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో “డీజే టిల్లు స్క్వేర్” ఓటీటీ రైట్స్ ను .. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు 35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. పైగా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకునే విషయంలో.. పలువురు హీరోల రికార్డ్స్ ను డీజే టిల్లు స్వ్కేర్ మూవీ క్రాస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ లో మోస్ట్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే సినిమాగా .. నిలుస్తోందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో ఏడు మిలియన్ల కుపైగా వ్యూస్ వచ్చాయి. కాగా ఈ మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. మరి, విడుదలకు ముందే “డీజే టిల్లు స్క్వేర్” సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరల్లో అమ్ముడుపోయిన విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.