iDreamPost
android-app
ios-app

డీజే టిల్లు వచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!

  • Author ajaykrishna Published - 05:13 PM, Fri - 27 October 23

ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాలలో 'డీజే టిల్లు స్క్వేర్' ఒకటి. ఎట్టకేలకు పలు రిలీజ్ డేట్స్ నుండి వాయిదా పడుతూ.. టిల్లు స్క్వేర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాలలో 'డీజే టిల్లు స్క్వేర్' ఒకటి. ఎట్టకేలకు పలు రిలీజ్ డేట్స్ నుండి వాయిదా పడుతూ.. టిల్లు స్క్వేర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

  • Author ajaykrishna Published - 05:13 PM, Fri - 27 October 23
డీజే టిల్లు వచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!

టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాలలో ‘డీజే టిల్లు స్క్వేర్’ ఒకటి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని మల్లిక్ రామ్ తెరకేక్కిస్తున్నారు. సినిమాని సాలిడ్ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. కాగా.. గతేడాది ఆరంభంలో డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో సిద్ధు. కెరీర్ లో పడిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే కావడంతో.. అదే స్టార్డమ్ ని జాగ్రత్తగా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూ.. హీరోగా మారిన సిద్ధు.. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. వెంటనే టిల్లు స్క్వేర్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు.

సిద్ధు హీరో మాత్రమే కాదు.. తన సినిమాలకు దాదాపు రైటింగ్ అంతా తానే చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే డీజే టిల్లు కూడా రాసుకున్నాడు.. ఫుల్ ఫన్ తో పక్కా హైదరాబాద్ బోయగూడ ఏరియా యాటిట్యూడ్ తో సినిమాని స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు. గతేడాది ఫిబ్రవరి 12న డీజే టిల్లు.. మోస్తరు అంచనాలతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలా ఒక్కసారిగా హీరోగా, రైటర్ గా సక్సెస్ అయిపోయాడు. ఇండస్ట్రీలో కావాల్సిన అటెన్షన్ కూడా దక్కింది. ఇంకేముంది.. అదే ఊపులో డీజే టిల్లు సీక్వెల్ రాసి.. షూట్ చేశారు. ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఎట్టకేలకు పలు రిలీజ్ డేట్స్ నుండి వాయిదా పడుతూ.. టిల్లు స్క్వేర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

తాజాగా డీజే టిల్లు స్క్వేర్ కి సంబంధించి మేకర్స్ న్యూ రిలీజ్ డేట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. లేటు అయినా పర్లేదు గానీ.. టెన్షన్ లేకుండా వద్దాం అనుకున్నారేమో.. ఏకంగా నాలుగు నెలలకు వాయిదా వేసేసారు. అవును.. టిల్లు స్క్వేర్ వచ్చేది 2024 ఫిబ్రవరిలో. మహాశివరాత్రి ఫెస్టివల్ టైమ్ లో.. ఫిబ్రవరి 9న టిల్లు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. అంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారో తెలియదు. బట్.. సాలిడ్ కంటెంట్ తో వస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాలో టిల్లు డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు. అనుపమ కూడా రొమాన్స్ కి సిద్ధపడినట్లు విడుదలైన సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. మరి టిల్లు బాయ్ వచ్చేది వచ్చే ఏడాది.. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom