iDreamPost
android-app
ios-app

Disha Patani : ఐకాన్ స్టార్ సరసన భాగీ బ్యూటీ

  • Published Mar 24, 2022 | 4:03 PM Updated Updated Mar 24, 2022 | 4:04 PM
  • Published Mar 24, 2022 | 4:03 PMUpdated Mar 24, 2022 | 4:04 PM
Disha Patani : ఐకాన్ స్టార్ సరసన భాగీ బ్యూటీ

పుష్ప 1 సక్సెస్ లో మ్యూజిక్ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా ఓ రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ షోకు ఏ మాత్రం వెనుకాడనని సామ్ ఇచ్చిన మెసేజ్ దర్శకులకు స్పష్టంగా వెళ్లిపోయింది. ఇప్పుడు పుష్ప 2లోనూ దాన్ని మించిన ఐటెం సాంగ్ ని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారట. ఈసారి బాలీవుడ్ భామ దిశా పటానిని ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. వాస్తవానికి ఫస్ట్ పార్ట్ కే తనను ట్రై చేశారు. కానీ కాల్ షీట్స్ సమస్య వల్ల సాధ్యపడలేదు. ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందే మాట్లాడుకుని గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు ఇన్ సైడ్ టాక్

షూటింగ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అధికారికంగా ప్రకటించలేదు. ఆ మధ్య ఫిబ్రవరిలో మొదలుపెడతారనే టాక్ వచ్చింది కానీ ఏప్రిల్ కు దగ్గరవుతున్న ఎలాంటి అప్ డేట్ లేదు. బన్నీ మాత్రం అదే హెయిర్ స్టైల్ ని కొనసాగిస్తూ సుక్కు కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా అయితే 2022 డిసెంబర్ లో పుష్ప 2ని విడుదల చేయడం కష్టమే. దానికి బదులు 2023 సమ్మర్ కి లేదా వీలైతే సంక్రాంతికి వచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కానీ సుకుమార్ మేకింగ్ స్టైల్, చివరి దశలో తీసుకునే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుంటే వేసవికి రావడమే మంచి పని. ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ కూడా చూసుకోవాల్సి ఉంది.

బాహుబలికి మాత్రమే ఉన్న సీక్వెల్ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ని పుష్పతో రిపీట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు బన్నీ. దాని తోడు నార్త్ లో తనకు ఫాలోయింగ్ పెరగడంతో పాటు పుష్ప కాన్సెప్ట్ అక్కడి జనానికి బ్రహ్మాండంగా కనెక్ట్ కావడంతో రెండో భాగం ఇంకా బలంగా రూపొందేలా పలు మార్పులు చేయిస్తున్నట్టు వినికిడి. పుష్ప 1లో కొన్ని లోపాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి కానీ కొన్ని ఏరియాలలో ఇబ్బందులు తప్పలేదు. క్రిటిక్స్ కూడా కొన్ని అంశాల్లో పెదవి విరిచారు. వాటన్నింటిని సరిచేసి మరింత బలమైన కంటెంట్ తో తీర్చిదిద్దుతారట. మొత్తానికి సీక్వెల్ కోసం అభిమానులు ఇంకో ఏడాది వెయిట్ చేయక తప్పేలా లేదు

Also Read : RRR Collections : ఇన్ని వందల కోట్లు వస్తేనే బ్లాక్ బస్టర్

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet