iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కోసం పాన్ ఇండియా స్క్రిప్టులు రాస్తున్న స్టార్ డైరెక్టర్స్!

  • Author ajaykrishna Published - 02:18 PM, Wed - 16 August 23
  • Author ajaykrishna Published - 02:18 PM, Wed - 16 August 23
ప్రభాస్ కోసం పాన్ ఇండియా స్క్రిప్టులు రాస్తున్న స్టార్ డైరెక్టర్స్!

ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ అనే ఫేమ్ వచ్చాక.. ఆయా హీరోల ఫ్యాన్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలే ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్.. ఫ్యాన్స్ కి అలాంటి ట్రీటే ఇస్తున్నాడు. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిన డార్లింగ్.. ఆ తర్వాత చేసినవన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినవే. అయితే.. హీరోలు హిట్స్ లో ఉన్నప్పుడే ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ వాళ్ల కోసం కథలు రాస్తుంటారని అంటుంటారు. కానీ.. ప్రభాస్ విషయంలో ఇదంతా రివర్స్ జరుగుతుందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ప్రభాస్ ఎలాంటి ఫామ్ లో ఉన్నా.. అన్ని ఇండస్ట్రీస్ నుండి ఫామ్ లో ఉన్న దర్శకులు కథలు రెడీ చేస్తున్నారు.

ప్రస్తుతం డార్లింగ్ ఓవైపు ప్రశాంత్ నీల్ తో సలార్ కంప్లీట్ చేసి.. నాగ్ అశ్విన్ తో కల్కి కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. వీటిలో ముందుగా సలార్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న సలార్.. కేజీఎఫ్ కి లింక్ ఉందంటూ టాక్ నడుస్తోంది. మేకర్స్ అయితే ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ.. టీజర్ లో కనిపించిన షాట్స్.. కేజీఎఫ్ లో కనిపించేసరికి అంచనాలు మొదలయ్యాయి. అయితే.. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతోంది. మరోవైపు నాగ్ అశ్విన్ తో కల్కి.. పాన్ వరల్డ్ రేంజ్ లో రెడీ అవుతోంది. అత్యధిక భాషలలో విడుదలైన ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి రికార్డు సెట్ చేయబోతుంది. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా.. సలార్, కల్కి కాకుండా డైరెక్టర్ మారుతీతో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డితో స్పిరిట్ ఫిక్స్ అయ్యింది. అయితే.. ఈ సినిమాలే కాకుండా సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా ఓకే చేసినట్లు టాక్. ఇవన్నీ చేతిలో ఉండగానే.. ప్రభాస్ తో సినిమా ప్లానింగ్ ఉందంటూ గతంలో ఇద్దరు తమిళ డైరెక్టర్స్ చెప్పారు. కెరీర్ ఆరంభం నుండి సూపర్ ఫామ్ లో ఉన్న ఆ డైరెక్టర్స్ ఎవరంటే.. అట్లీ, లోకేష్ కనగరాజ్. వీరి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ ఇద్దరూ ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొని.. పాన్ ఇండియా స్క్రిప్టులు రెడీ చేస్తున్నట్లు టాక్. ఎందుకంటే.. జవాన్ తో అట్లీ, లియోతో లోకేష్ పాన్ ఇండియా డైరెక్టర్స్ కాబోతున్నారు. ప్రెజెంట్ అట్లీ, లోకేష్ ప్రభాస్ కోసం స్క్రిప్ట్ లు రాస్తున్నారని సినీ వర్గాల టాక్. ఈ కాంబినేషన్స్ పై క్లారిటీ రావాల్సి ఉండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. మరి అట్లీ, లోకేష్ కాంబోలో ప్రభాస్ సినిమాలు పడితే ఎలా ఉంటాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet