iDreamPost
android-app
ios-app

రోలెక్స్ తో హరోల్డ్‌ దాస్‌ కు లింక్! రామ్ చరణ్ రంగంలోకి దిగినట్టేనా?

  • Author ajaykrishna Published - 01:39 PM, Wed - 16 August 23
  • Author ajaykrishna Published - 01:39 PM, Wed - 16 August 23
రోలెక్స్ తో హరోల్డ్‌ దాస్‌ కు లింక్! రామ్ చరణ్ రంగంలోకి దిగినట్టేనా?

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ పై ఫ్యాన్స్ లో రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా.. లోకేష్ ‘లియో’ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దిల్లీగా కార్తీ, విక్రమ్ గా కమల్ హాసన్, సంతానంగా విజయ్ సేతుపతి, రోలెక్స్ గా సూర్య.. లోకి యూనివర్స్ లో భాగమయ్యారు. ఇప్పుడు లియో క్యారెక్టర్ తో విజయ్ చేరుతున్నాడు. అయితే.. లియో ద్వారా విజయ్ మాత్రమే కాదు. మరిన్ని ఇంటరెస్టింగ్ క్యారెక్టర్స్.. లోకి యూనివర్స్ లో స్టార్ కాస్ట్ తో ఇంట్రడ్యూస్ కాబోతున్నాయి. లియోలో విజయ్ తో పాటు త్రిష, సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్.. ఇలా పలువురు స్టార్స్ ఎంటర్ అవుతున్నారు.

ఇక లియో మూవీ.. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది. కాగా.. ఈ సినిమా నుండి ఇప్పటికే విజయ్ లుక్ తో పాటు.. ఆంటోని దాస్ గా సంజయ్ దత్, హరోల్డ్ దాస్ గా అర్జున్ క్యారెక్టర్స్ పరిచయం చేశారు. అయితే.. ఇటీవల రిలీజ్ చేసిన హరోల్డ్ దాస్ క్యారెక్టర్ చూశాక.. చాలామందికి రోలెక్స్ తో లింక్ ఉందని టాక్ మొదలైంది. ఎందుకంటే.. హరోల్డ్ దాస్ లుక్ తో పాటు.. అతను బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ కూడా అచ్చం రోలెక్స్ కి దగ్గరగా ఉన్నాయి. అంటే.. హరోల్డ్ దాస్ అనేవాడు రోలెక్స్ బాగా దగ్గర వ్యక్తిగా అనిపిస్తుంది. ఇక సరిగ్గా గమనిస్తే.. హరోల్డ్ దాస్ క్యారెక్టర్ గ్లింప్స్ లో.. కారు షాట్ ఉంది. ఆ కారు నెంబర్ చూస్తే.. AP 29 అని రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ లెక్కన లియోలో తెలుగు నేపథ్యం కూడా కనిపించనుంది. ఇప్పటిదాకా మనం చూసిన క్యారెక్టర్స్ అన్నింటిలో విక్రమ్, రోలెక్స్ వీరి మధ్యనే వార్. మిగతా క్యారెక్టర్స్ అన్నీ రోలెక్స్ కింద.. ఇటు ఏజెంట్స్ గా విక్రమ్ కింద ఉన్నవారే. సో.. ఇప్పుడు హరోల్డ్ దాస్ క్యారెక్టర్ గ్లింప్స్ చూసుకుంటే.. ఈ వరల్డ్ లోకి తెలుగు నేపథ్యం కూడా రానుంది. అంటే.. లియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఉండబోతుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

లియోలో రామ్ చరణ్ కనిపిస్తాడన్న టాక్ ఎప్పటి నుండో ఉంది. దీన్ని ఖండిస్తూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో.. ఫ్యాన్స్ అయితే కాస్త ఆశ పెట్టుకుని ఉన్నారు. ఇక అన్నిటికీ మించి.. ఇప్పుడు హరోల్డ్ దాస్ నేపధ్యం తెలుగు కావడం, అతనికి రోలెక్స్ బిహేవియర్ మ్యాచ్ అవుతుండటంతో.. ఇక్కడ చరణ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి లియోలో చరణ్ రిఫరెన్స్ ఇది వరకే ఇచ్చారన్న ఓ టాక్ కూడా ఉంది. సంజయ్ దత్ పుట్టినరోజు నాడు వదిలిన ఆంటోని దాస్ గ్లింప్స్ లో ‘ఆంటోనీ’ అంటూ అరిచే వాయిస్ రామ్ చరణ్ వాయిస్ లా ఉందన్నది కొందరి వాదన. ఈ నేపథ్యంలో లియో కథ హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో.. లోకీ యూనివర్స్ లోకి గ్లోబల్ స్టార్ ఎంట్రీ ఖాయమైందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ క్యారెక్టర్స్.. తెలుగు రాష్ట్రాలలో ఉన్న రామ్ చరణ్ కోసం సృష్టించినవే అని, వీరిని దాటుకుని చరణ్ క్యారెక్టర్ రోలెక్స్ ని ఢీ కొట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.., ఇక్కడ అందరికన్నా మెయిన్ అయిన లియోకి చరణ్ సాయం చేస్తాడా? లేదా.. అతనితో కూడా తలపడుతాడా అన్నది మరో ప్రశ్న సో.. ఒక్కో లింక్ ని, క్యారెక్టర్స్ బ్యాక్ గ్రౌండ్ ని లోకేష్ ఎలా అల్లుకున్నాడో తెలియాలంటే లియో వచ్చేదాకా వెయిట్ చేయాలి. మొత్తానికి ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ గ్లింప్స్ లతో రామ్ చరణ్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేశాడని నెటిజన్స్, లోకి యూనివర్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి లోకి యూనివర్స్ లోకి రామ్ చరణ్ లైన్ క్లియర్ అయినట్లేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel