Venkateswarlu
Venkateswarlu
భారత చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రముఖ తమిళ నటుడు మారుముత్తు గుండెపోటు కారణంగా చనిపోయారు. ఆ తర్వాత హిందీ నిర్మాత ముఖేష్ ఉదేశీ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ చనిపోయారు. ఈ రెండు ఘటనలు మరువక ముందే ప్రముఖ తెలుగు నిర్మాత గోకినేని ప్రసాద్ అనారోగ్యం కారణంగా బుధవారం చనిపోయారు. ఇలా వరుస విషాదాలు వెంటాడుతున్న సినీ పరిశ్రమకు మరో షాక్ తగిలింది.
ప్రముఖ కన్నడ దర్శకుడు వీఆర్ భాస్కర్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. భాస్కర్ మృతి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. ఇక, ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు మైసూరులో జరగనున్నాయి.
కాగా, వీఆర్ భాస్కర్ దర్శకుడిగానే కాదు.. మాటల రచయితగా.. పాటల రచయితగా కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విష్ణువర్థన్‌లాంటి కన్నడ సూపర్ స్టార్‌లతో ఆయన పని చేశారు. విష్ణువర్థన్ నిర్మాణం వహించిన, నటించిన సినిమాల్లో ఎక్కువగా పని చేశారు. డైరెక్టర్‌గా మారి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, భారత చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.