iDreamPost
android-app
ios-app

Srikanth Odela: నా సర్టిఫికెట్స్ తగలబెట్టేశా.. ఎందుకంటే?: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

  • Published Aug 25, 2024 | 1:13 PM Updated Updated Aug 25, 2024 | 1:13 PM

శనివారం జరిగిన 'సరిపోదా శనివారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

శనివారం జరిగిన 'సరిపోదా శనివారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

  • Published Aug 25, 2024 | 1:13 PMUpdated Aug 25, 2024 | 1:13 PM
Srikanth Odela: నా సర్టిఫికెట్స్ తగలబెట్టేశా.. ఎందుకంటే?: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

శ్రీకాంత్ ఓదెల.. తన డెబ్యూ చిత్రంతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు. న్యాచురల్ స్టార్ నానితో తీసిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రూ. వంద కోట్ల క్లబ్ లో కూడా చేరింది ఈ మూవీ. ఇక ఈ మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో మూవీ రానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శనివారం జరిగిన ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరైయ్యారు. దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సైతం ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు. ఈ కార్యక్రమంలో తన జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను పంచుకున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయని చెప్పుకొచ్చాడు. అలాగే తన సర్టిఫికెట్స్ ను కాల్చేశానని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ..”నేను ఇంటర్ పాస్ అయితే.. బీటెక్ చేయించాలని మా నాన్న అనుకున్నారు. కానీ నాకు సినిమాలు అంటే పిచ్చి.. అందుకే కావాలనే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. కానీ ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ కావాలంటే ఇంటర్ పాస్ కావాలని తెలిసి, పాస్ అయ్యాను. ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే.. అక్కడ కూడా నేను ఫెయిల్ కావడంతో.. బీటెక్ చేయించాలని మళ్లీ మా నాన్న, బాబయ్ పట్టుబట్టారు. వీళ్లు నా దగ్గర సర్టిఫికెట్స్ ఉండటం వల్లే ఇలా చేస్తున్నారని, కోపంతో నా ఇంటర్, 10th, 7th క్లాస్ సర్టిఫికెట్స్ ను తగలబెట్టేశాను. అయితే వివేక్ ఆత్రేయ తీసిన ‘బ్రోచేవారెవరురా’ మూవీలో అచ్చం ఇలాంటి సీనే ఉంది. సేమ్ నా సీన్ రాసిండు అనుకున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss