iDreamPost
android-app
ios-app

రవితేజ సరికొత్త ప్రయోగం.. మరి ఈసారి ఏమౌతుందో?

  • Author Soma Sekhar Published - 06:42 PM, Sat - 11 November 23

కథల విషయంలో మాస్ మహారాజా తన రూట్ మార్చాడు. తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి రవితేజ సిద్దమవుతున్నట్లు సమాచారం. మరి ఆ మూవీకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

కథల విషయంలో మాస్ మహారాజా తన రూట్ మార్చాడు. తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి రవితేజ సిద్దమవుతున్నట్లు సమాచారం. మరి ఆ మూవీకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 06:42 PM, Sat - 11 November 23
రవితేజ సరికొత్త ప్రయోగం.. మరి ఈసారి ఏమౌతుందో?

రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగాడు. ఒకే సంవత్సరంలో మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మాస్ మహారాజా కథల సెలక్షన్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ.. వెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలకు దూరంగా బయోపిక్కులు, యాక్షన్ ఎంటర్ టైనర్ల వైపు ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కాగా.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘ఈగల్’ మూవీ కూడా ఓ ఎక్స్ పరిమెంట్ లానే కనిపిస్తోంది. ఈ విషయం టీజర్ చూస్తేనే అర్ధమవుతోంది. ఇక తాజాగా మాస్ మహారాజాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘లెనిన్’ అనే డిఫరెంట్ మూవీతో రాబోతున్నాడట రవితేజ. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో సరికొత్త ప్రయోగాలు చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటి వరకు ఎక్కువగా కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన రవితేజ.. తాజాగా ఈ పంథాకు ముగింపుపలికినట్లు సమాచారం. సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు ఈ క్రేజీ హీరో. అందులో భాగంగానే ఈ సంక్రాంతికి ‘ఈగల్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత రవితేజ చేసే సినిమాల్లో ప్రయోగాలకే పెద్దపీట వేస్తున్నాడట. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చాడు దర్శకుడు మురళి కిషోర్. అతడు ఓ లైన్ ను రవితేజకు వినిపించాడట. అది కాస్త నచ్చడంతో.. ఫైనల్ వెర్షన్ అయ్యాక కథ వింటనని చెప్పాడట.

దీంతో డైరెక్టర్ ఈ స్క్రీప్ట్ మీద పనిచేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల వినికిడి. ఈ మూవీకి ‘లెనిన్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారని వినికిడి. 90వ దశకం బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. పైగా లెనిన్ అనే టైటిల్ ని చాలా ఆలోచించి పెట్టారని పైగా రవితేజ లాంటి హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాడట డైరెక్టర్. కాగా.. ఫైనల్ స్టోరీ నేరేషన్ రవితేజకు నచ్చితే.. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. కాగా.. గత రెండు మూడు సినిమాల నుంచి మాస్ మహారాజా కథల విషయలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే టైగర్ నాగేశ్వరరావు విషయంలో ప్రయోగం కాస్త బెడిసికొట్టింది. మరి లెనిన్ విషయంలో చేస్తున్న ఎక్స్ పరిమెంట్ ఏ విధంగా ఉంటుందో వేచిచూడాలి. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి కథల పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తున్న రవితేజపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss