iDreamPost
android-app
ios-app

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. తెరపైకి దర్శకుడు క్రిష్‌?

  • Published Feb 27, 2024 | 1:37 PM Updated Updated Feb 27, 2024 | 2:07 PM

రాడిషన్ హోటల్ పై జరిపిన సోదాల్లో పోలీసులకు భారీగా డ్రగ్స్ లభించాయి. ఇందులో వీఐపీలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పుడు ప్రముఖ దర్శకుడి పేరు వినిపిస్తోంది.

రాడిషన్ హోటల్ పై జరిపిన సోదాల్లో పోలీసులకు భారీగా డ్రగ్స్ లభించాయి. ఇందులో వీఐపీలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పుడు ప్రముఖ దర్శకుడి పేరు వినిపిస్తోంది.

  • Published Feb 27, 2024 | 1:37 PMUpdated Feb 27, 2024 | 2:07 PM
రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. తెరపైకి దర్శకుడు క్రిష్‌?

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిషన్ హోటల్ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే శేరిలింగం పల్లి బీజెపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు, మంజీర మాల్ ఓనర్ వివేకానంద పట్టుబడ్డాడు. వీరితో పాటు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌తో సహా పది మంది వీఐపీలపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో  తెలుగు హీరోయిన్ సోదరి పేరు వినిపించింది. తెలుగు హీరోయిన్, యూట్యూబర్ కుషిత కల్లపు సోదరి,  లిషి గణేష్ పై కేసు నమోదు అయ్యింది. కాగా, తాజాగా పెడ్లర్ అబ్బాస్ ను నార్కొటిక్ పోలీసులు విచారించగా.. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది.  డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేదకానందతో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది.

మంజీరా మాల్ ఓనర్ ఓనర్ గజ్జెల వివేకానందకు క్రిష్ స్నేహితుడు. వివేకానంద నిర్వహిస్తున్న పార్టీలకు క్రిష్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. క్రిష్ జాగర్లమూడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని ఎఫ్ఐఆర్‌లో 8వ నిందితుడిగా క్రిష్ పేరును చేర్చారు. క్రిష్ నుండి స్టేట్ మెంట్ తీసుకున్నారు. కాగా, తమ స్నేహితులు పిలవడం వల్లే పార్టీకి వెళ్లానని, డ్రైవర్ రాగానే అక్కడి నుండి వెళ్లిపోయినట్లు క్రిష్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దర్శకుడు క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన క్రిష్.. ప్రస్తుతం అనుష్కతో మరో మూవీ చేయబోతున్నట్లు సమాచారం.

విభిన్నమైన కథలను తెరకెక్కించడంతో.. మంచి దర్శకుడిగా పేరుగాంచాడు క్రిష్ జాగర్లమూడి.  గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్- కథానాయకుడ, మహనాయకుడు, కొండ పొలం వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీర మల్లుకు దర్శకత్వం వహిస్తున్నాడు.  వివిధ కారణాల వల్ల ఈ మూవీ ఆలస్యం అవుతూ ఉండడం వల్ల.. అనుష్కతో ప్రాజెక్టు మొదలు పెట్టాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  ఇంతలో  ఇలా ఆయన పేరు వినిపిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş