iDreamPost
android-app
ios-app

Koratala Siva: కోట్లలో ట్యాక్స్ కట్టే వారికి.. ప్రత్యేక క్యూ లైన్స్ ఉండాలి: కొరటాల శివ

  • Published Aug 17, 2024 | 1:30 PM Updated Updated Aug 17, 2024 | 1:30 PM

లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తో ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ పాడ్ కాస్ట్ లో ట్యాక్స్ కట్టేవారికి ప్రత్యేక క్యూ లైన్స్ ఉండాలని పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తో ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ పాడ్ కాస్ట్ లో ట్యాక్స్ కట్టేవారికి ప్రత్యేక క్యూ లైన్స్ ఉండాలని పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Koratala Siva: కోట్లలో ట్యాక్స్ కట్టే వారికి.. ప్రత్యేక క్యూ లైన్స్ ఉండాలి: కొరటాల శివ

సామాజిక అంశాలను సినిమాల్లో జోడిస్తూ.. ప్రేక్షకులను ఆలోచింపజేసే దర్శకులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అందులో ఒకరు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రూపొందించిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడమే కాకుండా.. సగటు సినీ ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. తన సినిమాతో సమాజానికి ఏదో ఒక సందేశం ఇస్తుంటారు ఈ స్టార్ డైరెక్టర్. తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తో పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్యాక్స్ కట్టేవారికి ప్రత్యేక క్యూ లైన్స్ ఉండాలని పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు కొరటాల శివ.

కమర్షియల్ కథలకు సామాజిక అంశాలను జోడీస్తూ.. సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ. ఈ విషయం ఆయన తెరకెక్కించిన గత సినిమాలు జనతా  గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు చూస్తేనే తెలుస్తుంది. కొరటాల శివకు సామాజిక స్పృహ ఎక్కువని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అయితే.. తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తో కలిసి ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు కొరటాల శివ. ఈ పాడ్ కాస్ట్ లో టాక్స్ పేయర్ల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. టాక్స్ కట్టేవారికి ప్రభుత్వం ప్రత్యేకమైన సౌకర్యాలు ఏమిస్తుంది? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

koratala shiva interesting comments about tax payers

కొరటాల శివ మాట్లాడుతూ..”సాధారణంగా నేను ఎయిర్ పోర్ట్ లో అందరూ వెళ్లినట్లుగానే క్యూ లైన్లో నిల్చొని వెళ్తాను. కానీ ఓసారి అర్జెంట్ గా హైదరాబాద్ లో మీటింగ్ చూసుకుని చెన్నై వెళ్లాల్సి వచ్చింది. దాంతో హడావిడిగా ఎయిర్ పోర్ట్ కు పరిగెత్తాను. అయితే నన్ను గుర్తుపట్టిన ఓ ప్రోటోకాల్ అధికారి.. పక్క నుంచి తీసుకెళ్లారు. ఇది చూసిన లైన్లో ఉన్న వ్యక్తి.. కొరటాల శివ అయితే గొప్పా? అంటూ అరిచారు. దాంతో నాకు కోపం వచ్చి.. సంవత్సరానికి నేను 4 కోట్ల ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నాను. అలాంటి నాకు కనీసం ఈ సౌకర్యం అయినా ఇవ్వండి. మీరు పెద్ధవారు. ఇంతకు మించిన సౌకర్యం నాకు ఈ దేశంలో లేదు. అత్యవసరాల్లో అయినా ఇది వాడుకోకపోతే ఎలా అంటూ వెళ్లిపోయాను” అంటూ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఇక ఇదే విషయాన్ని అక్కడి అధికారిని కూడా అడిగినట్లు కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఎయిర్ పోర్ట్, తిరుమలలో రాజకీయ నాయకులకు ప్రత్యేక క్యూ లైన్స్ పెట్టినట్లు మాక్కూడా పెడితే సంతోషంగా ఫీల్ అవుతాం కదా అని తెలిపాడు. కోట్లకు కోట్లు టాక్స్ కట్టే మాలాంటి వాళ్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఉండాలని ఆయన చెప్పుకొచ్చాడు. టాక్స్ పేయర్స్ కి సపరేట్ క్యూ లైన్స్ పెడితే.. పక్క లైన్లోని వారు కూడా టాక్స్ కట్టి.. స్పెషల్ లైన్లో వెళ్లాలని చూస్తాడు కదా? ఈ దేశంలో టాక్స్ పేయర్లకు ఏం చేయలేమా? అని ప్రశ్నించాడు కొరటాల శివ. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. నెటిజన్లు సైతం ఇది కూడా కరక్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి టాక్స్ కట్టేవారికి ప్రత్యేక క్యూ లైన్ ఉండాలన్న కొరటాల శివ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.