iDreamPost
android-app
ios-app

Chuttamalle Song: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘చుట్టమల్లే’ సాంగ్! ఏకంగా 100 మిలియన్ల వ్యూస్..

  • Published Aug 17, 2024 | 12:37 PM Updated Updated Aug 17, 2024 | 12:39 PM

దేవర నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ 'చుట్టమల్లే' సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కోట్లలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును సృష్టించింది.

దేవర నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ 'చుట్టమల్లే' సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కోట్లలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును సృష్టించింది.

  • Published Aug 17, 2024 | 12:37 PMUpdated Aug 17, 2024 | 12:39 PM
Chuttamalle Song: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘చుట్టమల్లే’ సాంగ్! ఏకంగా 100 మిలియన్ల వ్యూస్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తన పార్ట్ షూటింగ్ ను ఎన్టీఆర్ పూర్తి చేసినట్లు తెలిపాడు. అదీకాక తాజాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర ‘భైరా’ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. దేవర నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ‘చుట్టమల్లే’ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కోట్లలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును సృష్టించింది.

‘చుట్టమల్లే’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా ఆగస్ట్ 5న విడుదలైన ఈ పాట.. 11 రోజుల్లోనే యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ.. టాప్ 1 ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పటి వరకు ఈ పాటకు 100 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో ఇది నయా రికార్డ్ అనే చెప్పాలి. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కు ఎన్టీఆర్ లుక్స్, జాన్వీ కపూర్ గ్లామర్ తోడవడంతో ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

devara song new record

రామజోగయ్య శాస్త్రి పదాలతో మ్యాజిక్ చేశాడు. ఇక తన గొంతుతో ఆ సాంగ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది శిల్పారావు. ఇప్పటి వరకు కేవలం తెలుగులోనే 70 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది ఈ సాంగ్. హిందీలో 21 మిలియన్లు, మిగతా భాషల్లో కూడా టాప్ వ్యూయర్ షిప్ ను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ పాటను కాపీ ట్యూన్ అని చాలా మంది ట్రోల్ చేశారు. ఇదెక్కడి సాంగ్ రా అని విమర్శించారు. కానీ అవన్నింటినీ 11 రోజుల్లో మడతపెట్టేసి రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తున్న దేవర సాంగ్.. రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. చుట్టమల్లే సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ కంప్లీట్ చేసుకోవడంతో.. ఇది సర్ దేవర రేంజ్ అంటూ తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio