iDreamPost
android-app
ios-app

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే: హరీష్ శంకర్

  • Published Jul 31, 2024 | 12:29 PM Updated Updated Jul 31, 2024 | 12:29 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యా మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందో కారణం చెప్పుకొచ్చాడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యా మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందో కారణం చెప్పుకొచ్చాడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే: హరీష్ శంకర్

హరీష్ శంకర్.. రవితేజతో ‘మిరపకాయ్’, పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను ప్రేక్షకులకు అందించాడు. దాంతో సహజంగానే తన మూడో సినిమాపై భారీ అంచానలు నెలకొన్నాయి. పైగా మూడో సినిమాలో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇంకేముందు అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. హరీష్ శంకర్ సైతం హ్యాట్రిక్ కొట్టాలని ఊపులో ఉన్నాడు. కానీ సీన్ మెుత్తం రివర్స్ అయ్యింది. తారక్ తో తీసిన రామయ్యా వస్తావయ్యా మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందో కారణం చెప్పుకొచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్.

‘రామయ్యా వస్తావయ్యా’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో 2013లో వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ గా నిలిచిందో అప్పట్లో ఎవ్వరికీ అర్ధం కాలేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఈ సందర్భంగా రామయ్యా వస్తావయ్యా మూవీ ఫ్లాప్ కు రీజన్ చెప్పుకొచ్చాడు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ..”రామయ్యా వస్తావయ్యా మూవీ ఫ్లాప్ కు మెయిన్ రీజన్ సెకండాఫే. ఎందుకంటే? ఇంటర్వెల్ లోనే మెయిన్ విలన్ చనిపోతాడని, అక్కడే సినిమా అయిపోయిందని.. ఇక సెకండాఫ్ లో చూడ్డానికి ఏమీ లేదని ప్రేక్షకులు భావించారు. ఇక నేను కూడా సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో సరిగ్గా చూసుకోలేదు. ఈ సినిమాకు నేను ఎంతో కష్టపడి పనిచేశాను. కానీ ఫలితం రాలేదు. ఈ మూవీ ఫెయిల్యూర్ విషయంలో నేను ఎవ్వరినీ నిందించను. సక్సెస్ క్రెడిట్ ఇతరులకు ఇస్తాను. ఫెయిల్యూర్ ను మాత్రం నేనే స్వీకరిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీష్ శంకర్-రవితేజ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలో సందడి చేయనుంది.